ప్రేమే దైవమనే లొకం
ప్రేమను పలుమార్లు చంపినప్పుడు పుట్టిందే కవిత
భూమి ఆకాశం కలిసేచోటుకెళదాం అన్న జాణ బేలతనానికి
నా వెర్రితనం తొడైనప్పుడు పుట్టిందే కవిత
రాతి హృదయం కరగదంటారు –
కానీ పర్వతంలోంచి నీళ్ళు కారినప్పుడే పారింది కవిత,
నేను విషంతో కాకుండా –
ఆమె విరహంలో ఎన్నోసార్లు చచ్చినప్పుడు పుట్టిందే కవిత,
ఆ కళ్ళలో నన్ను నేనే చూసుకుంటున్నప్పుడు –
ఎలా ఉన్నాను అన్న ఆమె ప్రశ్నకు జవాబే కవిత,
నా ప్రేయసికై చేతులు చాచినపుడు –
అదే అదనుగా విధి నన్ను కౌగిలించినపుడు కలిసిందే కవిత,
కవిత అంటే ఒక అమ్మాయి అనుకున్న నాకు –
భువనవిజయ కవుల స్నేహంతో నా కలం ఒలికిన అక్షరాలే కవిత,
సాహితీ మిత్రులంతా సమయం చేసుకుని కలిసినపుడు –
కమ్మనైన మితభాషణల కమనీయమైన మాటల మూటలే కవిత”