చంపకమాల:
అలసటనొందకెన్నడును హాయినెరుంగక కష్టనష్టముల్
మెలకువగానెదుర్కొనుచు మిక్కిలిబాధ్యతతోడ తండ్రిగా
వెలయుచు ప్రేమజూపెడి పవిత్రవిశాలమనస్సు నీదియౌ
సలలిత రాగసుందర రసానుభవాద్భుత సారమీయగన్
చంపకమాల:
ముదమునగన్న తండ్రిని నమోస్తనుచుండెదనెల్ల వేళలన్
పదునుగనాదు బుద్దిని తపస్వినిగానిలబెట్టు నాధుడై
ఎదురునులేదు నీకనుచు ఏ పొరపాటునుజేయకుండగా
చదువులరాణి నీకెపుడు జాగృతిజేయుచు దీవెనందించన్
–మల్లికేశ్వర రావు కొంచాడ