పెళ్లి చూపులకని!
పెద్దోళ్ళు లొల్లి
చేసినప్పుడే!
బంధం అల్లినప్పుడే
నీకు చెప్పాను!
నువు కళ్ళల్లో కళ్లెట్టి!
కల్లా కపటం ఎరుగక
నవ్వి నప్పుడూ!
నీకు చెప్పాను!
మెడలో
మూడు ముడులేస్తూ!
సుతారంగా తడిమి మరీ!
నీకు చెప్పాను!
నిన్ను కలిసేది
కొన్ని రోజులే అని!
వున్న కాలాలు నీవని!
తలపులే వలపు వూసులని!
విన్నావా!
నీతోనే పయనమంటూ!
చేత చెయ్యేశావు!
అగ్ని సాక్షిగా అడుగేసావ్!
ఏ ఇసుక తుఫాను లో
ఉసురు పోతుందో!
ఏ మంచు కొండ మాటు
మృత్యువు పొంచివుందో!
ఏ నడి సంద్రంలో
ఈ జీవం కొడిగడుతుందో!
తెలిసి మరీ!
వలచావు!
నా సహచరిగా
నిలిచావు!
పిల్లల్ని గుండెలపై
దొర్లించి!
ధైర్యపు కథలను
వినిపించావు!
ఎదురు చూసే పిల్లలు
ఏరీ నాన్నంటే!
ధీశాలి వై చెప్పావు!
తామ్ర సౌర్య పతకంలో!
దేశ చరిత పుటల్లో
నేనున్నానని!
సెల్యూట్ భార్యా మణి!
ఎల్లలెరుగని త్యాగానికి
చెల్లు చిరునామా నువ్వని!
నిలువెత్తు నిబ్బరానికి
విలువైన సంతకమని!
నీ కనుల మాటు చెమ్మలో
సదా కదలాడే… నీ…
మీ…✍🏼 విక్టరీ శంకర్