జల్లు కురిసింది

జల్లు కురిసింది ,వానవెలిసింది,
గల గల నీరు పారింది
విరజాజి మల్లె మంకెన
పున్నాగ బొగడ,
విరులు విరిసి ,మరువ,ధవనాలు
మరి మరి మురిసే
పరిమళాలు వెదజల్లె
చిరు, చిరు చలిగాలులు సుగంధ
సౌరభాల తోడ్కొని
ప్రకృతి పరిసరాల పరచే ,॥ జల్లు కురిసింది ॥

జిలి బిలి తళుకుల తారల జేరి,
చల్లని వెన్నెలల జాబిలి తెల్లని,
వెలుగుల ఇలకు పంపే,
రేయంత మెరవ విరి తూణీరముల
సంధించి
చెరకు వింటి వేలుపు
రేయంత వీర విహారము జేసి
యువహృదయాల మరుల ఝరులు
మెరిపించి కురిపించి
ముసలి, ముతక మదిలోనూ
మలిగిన మొహావేసాలు మరల
దోబూచులాడించి
తెల తెలవారగానే తెరమరుగాయె.
—————————————–
కామేశ్వరి సాంబమూర్తి, భమిడిపాటి

Scroll to Top