అమ్మని చూడాలని అనిపించి
నాన్నని కలవాలనిపించి
తమ్ముడు గురుతుకొస్తుంటే
అక్క చెల్లిళ్ళు ఎలాఉన్నారో అని
రొటీన్ ప్రవాసజీవతంపై విసిగి
అందరూ ఉండికూడా, నాకు
ఈ ఒంటరి బతుకేంటని
అనిపించిందే తడవుగా
ఫ్లైట్ సెంటర్కెల్లి కనుక్కోగా
అమ్మో! టికెట్ ధరెక్కువని?
నెల జీతం తగ్గుతుందని?
మార్ట్ గేజ్ కి మనీ ఎలాగని?
వారం సెలవు పెడితే ఎలా?
అసలే కాంట్రాక్టు జాబని
డాలర్ల జాలర్ల గాలానికి చిక్కి
చేప వలె, నా ఆశ అడియాసైన
గజి బిజి మనసు సేద దీర్చెన్దుకై
ట్రెడ్మిల్లుపై మరోగంట నడువగా
ఆ స్వేదంలా, నీరుగారిపోయింది
ఏమిటో అంతా డాలర్ జీవితమైపోయిన్ది
ఏ డాలర్ అయినా రూపాయి అయినా
మరి అందరూ కొని తినేది ఆ మెతుకే
నిగూడమైన ఆ మర్మం తెలిసేంతవరకే
డాలర్ కోసం వెతికే ఈ కరెన్సీ బతుకు
అప్పటికిగాని పూర్తవదు ప్రవాసవనవాసం
అపుడు ఇండియా, ఇంగ్లాండ్
ఆస్ట్రేలియా, అమెరికా అన్నీ ఒకటే !