వసంత ఋతువు తొలినాళ్ళలో – అరవిరసిన గులాబీ నీవు!
తొలి సూర్య కిరణ స్పర్శ కోసం – ఎదురుచూసే హిమ బిందువు నీవు!
మనసును గిలిగింతలు పెట్టే – చల్లని పిల్లగాలివి నీవు!
నా పాళీలోనుంచి జాలువారిన – నవ కవితాకుసుమానివి నీవు!
మనసనే కాగితంలో – నే చిత్రించుకున్న చిత్తరువు నీవు!
నా మనసును కదిలించే – ప్రతి భావనలో నీవు!
నా హృదయమనే వీణను మీటితే – పలికే స్వరానివి నీవు!
“నేను” అని చెప్పుకునే – నా అణువణువులో నీవు!
ఒక్క మాటలో చెప్పాలంటే – నా సర్వస్వం నీవు!!