కవులలో కవితావేశం వరదలయి చిందులిడగా
వారి ఎదలో భావావేశం ఎగిసెగిసి పడుతోంది
కవితామతల్లి కరుణించిన నేపధ్యంలో కవులెల్లరి
కలాలనుండి కవనధారలు పెల్లుబుకుతున్నాయి
పదాల అల్లికలు కారాదు పదసిరుల పేటిక
కవితాంశం కావాలి కవి హృదయ వాటిక
వర్ణనా నిపుణత కాదు కవి కావ్య మార్గం
అతనిలోఎదగాలి పద్యమాలికల నైపుణ్యం
భువనవిజయ వేదిక నేలు కవులారా
నవ కవితా భవితకి నాంది పలుకండి
నవరసాల కవన వర్షం కురిపించండి
నవ్యసాహితికి దివ్యనీరాజనం పలుకండి
కొంచాడ నవగీత మార్గదర్శిగా
మురళీ మృదు గాన వీచికగా
వేణు కవనమాలిక కరదీపికగా
“భువనవిజయం”సాహితీ డోలికగా
సంద్రాలు దాటిన తెలుగు కవిత
పరిధుల్లేని ఆశుకవితాకెరటాలుగా
మెల్బోభువనవిజయ కీర్తి ఎదిగి
“కవనాంజలి” తీరాన్నిచేరిందహో!
కవులార కదలండి కొంచాడ గుడికి
విదిలించి కదిలించండి మీ కలాల్ని
పద్య గద్య గీతా గాథా సుమాలతో
ఘటించండి నవ్యదివ్య “కవనాంజలి”