కవిత సత్తా – పత్తా

ఓ కవితా నాకవితా
నేనెక్క డని నిన్ను వెతుకుతా
నీ చిరునామా అడిగితే ఏమని చెబుతా
అగ్ని పర్వతం లో లావా ల కుతకుత
ఎక్కడిదంటే ఎప్పడి దంటే ఏమని చెబుతా
అగ్ని సాక్షి కి సాక్షి విషయమ ?
ఎవరినడుగుత ? ఏమనడుగుత ?

ఓ కవితా నాకవితా
నేనెక్క డని నిన్ను వెతుకుతా
నీ చిరునామా అడిగితే ఏమని చెబుతా
సృజన శక్త ది ఏడ నుందని చుక్క పెడతా
ఉగ్గబట్టిన గుండె గుబులెప్పుడు
పై కుబుకు తా ననడిగితె ఏమి చెబుతా ?
ఏరి నడుగుత ?

ఓ కవితా నాకవితా
నేనెక్క డని నిన్ను వెతుకుతా
నీ చిరునామా అడిగితే ఏమని చెబుతా
ఉలికి తెలియదు శిలకు తెలియదు
మగ్నమై ఉలికి పడు యా శిలిపి కసలే తెలియదు
శిల్ప మెక్కడ నున్నదం టే ఏమి చెబుతా
నడువ గలిగే శిలలు చెక్కే నలువ రాతా ?
నలువ రాత కు దాతె వరదంటే ఏమి చెబుతా

ఓ కవితా నాకవితా
నేనెక్క డని నిన్ను వెతుకుతా
నీ చిరునామా అడిగితే ఏమని చెబుతా
అంతరాల కె పరిమితమ్మా గుట్టదంతా ?
రట్టు జేసిన రగులు కొల్పా మొత్తమంతా ?
మెదడు మనసుల కలిపివేతా? కాదు తీసి వేతా ?
బాహ్యాంతర ముల చెరిపివేతే దాని కొలతా ?

ఓ కవితా నాకవితానేనెక్క డని నిన్ను వెతుకుతా
నీ చిరునామా అడిగితే ఏమని చెబుతా

Scroll to Top