నేర్చుకోండి, నేర్పండి

భాషించే భాషలో భావం
మనసు మెదిలి వస్తుంటే
అనుబంధం అర్థాన్ని
ఆత్మతో స్పృశిస్తుంటే
ఉల్లాసంతో ఉత్సాహం
ఉవ్వెత్తున రేకెత్తిస్తే
గాయపడి, బాధలో
అమ్మా! అబ్బా! దేవుడా..! అని
దైవం, తలిదండ్రుల గురుతుకుతెచ్చి
ఆ మమకారాన నిను తడిపి
ఆ బాధ, వ్యధలను మరిపిస్తే
ఆ పలుకే ! మరి తల్లి భాష
ఉగ్గుపాలతో నువు నేర్చిన భాష
నావరకైతే అది, నేనమితంగా
ప్రేమించే నా తెలుగు భాష

మరి మీకో ..?
ప్రేమించండి, ఆదరించండి
నేర్చుకోండి, నేర్పండి
తరతరాలకు తెలపండి
మాతృభాషను మరువద్దని
ప్రతి ఎదలో పదిలపరచమని

Scroll to Top