మాటలు కోట్లకొలది కోటలు దాటంగ
చేష్టలుడిగి పలుకంగా నేలా?
మురిపంబుగ మూడు మాటలు ముచ్చట గొల్పన్
చేతలతో ముడిపడి పల్కుట మేలగున్.
భావము మాటలచే వ్యక్తంబగు,
భావము భాషణలేకము కాగ,
ఆచరణ విచారణ ననుసర ణి ంచ
నదియె త్రికరణశుద్ధి యనంబడున్
ఎట్టి తెలివియు ననుభవజ్ఞ్యతకు దీటు రాదు
“పెద్దల మాట చద్ది మూట” యను సుద్ది కలదు
వినదగు వారి మాట వినయము తోడన్
వివరించదగు నాత్మ బుద్ధి వివేకమొప్పన్
మాటకు మాట బదులు చెప్పు వాదులాట
తగదు వితరణ శీలులేరికి నైనన్.
బూటకపు మాటలు ,పరుష వాక్యములు
వ్యర్ధ ప్రలాపంబులు ,స్ఫర్ధలు పెంచు శుష్క వాదముల్
డంబము చాటు నధిక ప్రసంగము మాని,
మాటలాడిన ముత్యములొలుకు నటుల
మిత భాషియై ,సుభాషితుడై,
సత్య ,ప్రియ ,హిత వాగ్వ్రతాధ్యుడై,తుదన్ మౌనియై,
ఆత్మానుభవము పొందు మహి తాత్ముం డై
చరితార్ధుండు కావలెన్.