అదిగో,అల్లదిగో అల్లంతదూరాన
“అమరావతి”ఆంద్ర రాజధాని ,హంస గమనగా
అరుదెంచు చున్నది,అమరావతి.
ఆంధ్రమాత అనుంగు బిడ్డ ,ఆంద్ర సచివ
చంద్రబాబు ఆశల వల్లరి దివిని తలపించు
అమరావతి ,భువిని దివ్య శోభల వెలుగు ॥ అదిగో,అల్లదిగో ॥
చంద్రబాబు సూత్రధారిగా సర్వమత సుహృద్భావ
శాంతియుత ,అహింసా ,ఐకమత్య భావ
కులమత బేధ ,ఈర్ష్యాద్వేష రహిత అమరావతి
ఏచోటు కాచోటు, ఏలోటు లేని
ఐస్వర్యఖని పలు చిత్రవిచిత్ర సుందర
ప్రదేశాల హరితవర్ణాల
ఫలపుస్ప వృక్ష జపాసు పాడి పంటల
నిండుగా విలసిల్లు అమరావతి
ఆకాశ హర్మ్యాల విద్యుద్దీప తారాతోరణ కాంతుల మెరయు
“అమరావతి “అంచెలంచెలుగా వెలయు
అడుగడుగు ,చంద్రబాబు
అహరహస్రమైక్య ఫలమై
సుందర నందనవనమై,ఆలయ గోపురాలు
వెలుగులీను,అమరావతి
“సత్యమేవజయతే,”అహింసామరమొధర్మ
సూత్రపాలనలో
వెలయు ఆమరావతి. జాతిపిత గాంధి
కళల సాకారమై
నిస్వార్ధ ధైర్య స్థైర్య వీర రక్షకభట
సైన్య విధుల ప్రాకారమై
స్త్రీజాతి ,రేయి పగలు నిర్భీతిగ సంచరించదగు
అమరావతి వెలయు
“మిస్సైల్ మాన్” అబ్డుల్ కలాం
స్వప్నసీమగా విద్యా వైజ్ఞ్యానిక
కేంద్రమై వెలయు పురాణెతిహాస
వేదవిద్యా లయములు ,
విశ్వ విద్యాలయములు ,ప్రాంగణమై,
భావనలతో
స్త్రీజాతి సౌభాగ్య ,సౌఖ్య ,జాగృతుల నిలయమై యొప్ప
॥ అమరావతి .॥
చంద్రబాబు ఖ్యాతి పతాక అనంత వీధుల
పరిఢవిల్లి “వంశవృక్షం “పలు శాఖలుగ
వెలుగొందు రీతి ,ఆంద్ర మాత
ఆశీసులిచ్చి ,గాచు గాక
—————————————-
కామేశ్వరి సాంబమూర్తి .భమిడిపాటి .
పి .ఎ . యు. ఎస్ .ఎ .