మనిషికి పుట్టుకంటేనే భయం!
అమ్మ కడుపునుండి
తిన్నగా వస్తాడో,రాడోని భయం!
ఆపై వేసే అడుగు,
ఎక్కడ వేస్తే ఏమౌతుందోనని భయం!
అటుపై చదువు గిదువు!
పాసవుతామా?లేదాని?భయం!
పాసైతే!
ర్యాంకు ఒకటా?వందా?భయం!
పోతే కన్నవాళ్ళు కసురుతారేమో నని భయం!
అన్ని ఒకే అనుకుంటే!
ఉద్యోగం వస్తుందా౹లేదాని భయం
తీరా వస్తే,
జీతం నాతం ఎంతాని భయం!
ఆపై పెల్లోక భయం,ఇల్లొక భయం!
అయిందిలే అనుకుంటే!
పిల్లలు పుడతారా,లేదాని భయం!
పుడితే,వారి భవిష్యత్తు ఏంటాని భయం!
ఇలా మనిషి జీవితం,జీవనం,
క్షణక్షణం భయం,భయం!
ఇక ఆ దిక్కుమాలిన చావెపుడు పలకరిస్తుందో నని బిక్కు మంటూ భయం!
ఇన్ని భయాల మధ్య నిత్యం చస్తూ.. చస్తూ..
అసలీ పుట్టుకెందుకని!
వేదాంతపు వెక్కిరింపుల భయం!
అయినా ఆగని, సగటు మనిషి జీవన పయనం
మీ…✍🏻విక్టరీ శంకర్