ఈ తరం సావిత్రి ‘కీర్తి సురేష్’ -పుట్టినరోజు అక్టోబర్ 17
కీర్తి సురేష్ .. ‘మహానటి’తో తనకంటూ తెలుగు తెర పై ఓ చరిత్రను రాసుకుంది. ఈ తరం సావిత్రిగా గుర్తింపు పొందిన కీర్తి ఎప్పుడూ తెలుగింటి అమ్మాయిలా నిండుగా కనిపిస్తుంది. ఈమె పుట్టినరోజు అక్టోబర్ 17 ఈ సందర్భంగా కీర్తి గురించి ముచ్చటించుకుండాం
కీర్తీ సురేష్ భారతీయ నటి. మలయాళం, తమిళ, తెలుగు సినిమాల్లో ఎక్కువగా నటించింది. మలయాళ నిర్మాత సురేష్ కుమార్, నటి మేనకల కుమార్తె కీర్తి సురేష్. కీర్తి అక్టోబర్ 17, 1992 తేదీన జన్మించింది. సినీ కుటుంబంలో పుట్టడం కారణంగా బాలనటిగా తెరంగేట్రం చేసింది. చిన్న తనంలోనే పలు చిత్రాల్లో అద్భుతంగా నటించింది.. 2000 మొదట్లో బాలనటిగా తెరంగేట్రం చేసిందామె ఆమె. ఫ్యాషన్ డిజైనింగ్ లో డిగ్రీ పూర్తి చేసి, వెండితెరకు తిరిగి వచ్చిన తరువాత హీరోయిన్ పాత్రల్లో నటిస్తుస్తోంది. 2013లో విడుదలైన మలయాళం సినిమా గీతాంజలి సినిమాతో హీరోయిన్ గా ఆమె పరిచయమయింది. ఆ తరువాత పలు తమిళ్, తెలుగు చిత్రాలలో కూడా నటిస్తోంది. మేనక నిజానికి తమిళ ప్రాంతానికి చెందినవారు. కీర్తీ అక్క రేవతీ సురేష్ వి.ఎఫ్.ఎక్స్ స్పెషలిస్ట్. షారుఖ్ ఖాన్ నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ లో పనిచేశారు రేవతి. నాలుగో తరగతి వరకు తమిళనాడులోని చెన్నైలో చదువుకున్నారు కీర్తి. ఆ తరువాత చదువు తిరువనంతపురంలోని కేంద్రీయ విద్యాలయలో సాగింది. తిరిగి చెన్నైకు పెర్ల్ అకాడమీలో ఫ్యాషన్ డిజైనింగ్ చేసేందుకు వచ్చారు. స్కాట్లాండ్ లో నాలుగు నెలల పాటు ఒక కోర్సు చదివిన కీర్తి, లండన్లో రెండు నెలల ఇంట్రెన్ షిప్ లో చేరారు. సినిమాల్లోకి నటిగా రాకపోయి ఉంటే డిజైనింగ్ లో ఉండేదాన్ని అని ఒక ఇంటర్వ్యూలో వివరించింది కీర్తి. మలయాళం సినిమాతోనే హీరోయిన్ గా వెండితెరకు పరిచయమైంది ఆమె. భారతదేశ చలన చిత్ర రంగంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన 66వ జాతీయ చలన చిత్ర అవార్డులో భాగంగా మహానటి సినిమాకి గాను కీర్తి సురేష్ ఉత్తమ తెలుగు కథానాయకిగా అవార్డు అందుకుంది. ‘కీర్తి సురేష్’ జిమ్ లో డైలీ గంట సేపు గడుపుతుంది. నిపుణుడైన ట్రైనర్ పర్యవేక్షణలో ఆబ్ క్రంచెస్, కార్డియో, వెయిట్స్ మరియు ఫ్రీ హాండ్ వంటి వ్యాయామాలను ‘కీర్తి సురేష్’ క్రమం తప్పకుండా చేస్తోంది. అందుకే ‘కీర్తి సురేష్’ మంచి క్రమశిక్షణతో కనిపిస్తోంది.