వెన్నునొప్పి నుంచి ఉపశమనం ఇలా…
శారీరక శ్రమ తగ్గిపోవడం, లైఫ్‌స్టైల్ మార్పులు, ఎక్కువ సేపు ఒకే భంగిమలో కూర్చోవడం, ఎక్కువగా కూర్చునే పనుల వల్ల వెన్నునొప్పి సమస్యలు ఎక్కువ అవుతున్నాయని నిపుణులు అంటున్నారు. చాలా మంది వెన్నునొప్పని తగ్గించడానికి రకరకాల బామ్స్, ఆయిల్స్, మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. కొన్ని న్యాచురల్ పద్ధతులతో, జాగ్రత్తలతో వెన్నునొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.
చాలా మంది వెన్నునొప్పి నుంచి ఉపశమనానికి రకరకాల బామ్స్, ఆయిల్స్, మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. వీటి వల్ల టెంపరరీ రిలీఫ్ ఉంటుంది కానీ, శాశ్వతంగా ఉపశమనం లభించదు. కొన్ని న్యాచురల్ పద్ధతులతో, జాగ్రత్తలతో వెన్నునొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.
మధ్య మధ్యలో విరామం
కంప్యూటర్ ముందు గంటల తరబడి కూర్చుని పనిచేస్తే వెన్నునొప్పి ఎక్కువ అవుతుంది. అందుకని మధ్య మధ్యలో విరామం తీసుకోవాలి. శరీరానికి విశ్రాంతి అవసరం. ఆఫీస్‌లో డెస్క్ ముందు నిఠారుగా కూర్చోవాలి. అలాగే నిలబడినప్పుడు పక్కకి వంగకూడదు. నిటారుగా కూర్చోవడం వల్ల వెన్నెపూసపై భారం తగ్గుతుంది. తద్వారా బ్యాక్ పెయిన్ పెద్దగా రాదు. తలను తిన్నగా పైకి ఉంచడం అవసరం. ఇంకా వెన్ను నొప్పి ఉంటే..వెన్నెముకను సక్రమంగా ఉంచడానికి టేప్, పట్టీలు లేదా స్ట్రెచి బ్యాండ్లను ఉపయోగించవచ్చు.
పోషకాహారం
బరువు ఎక్కువగా ఉన్నా.. నడుము నొప్పి వచ్చే అవకాశం ఉంది. వెన్నునొప్పిని నివారించడానికి, బరువు తగ్గండి. దిగువ వీపు నుంచి ఒత్తిడిని తగ్గించవచ్చు. మంచి ఆహారం తీసుకోండి. కొవ్వు ఉండే ఆహారాలు అస్సలు తినకండి. మీ ఆహారంలో చక్కెర తగ్గించండి. ఆకుకూరలు, కూరగాయలతోపాటూ… అవిసె గింజలు, సబ్జా గింజలు ఎక్కువగా తీసుకోండి. సీజనల్ ఫ్రూట్స్ తీసుకోండి.
కరివేపాకు ఎక్కువగా తీసుకోవటం వల్ల దీనిలో ల్యూటిన్, ఫోలిక్‌యాసిడ్, ఇనుమూ, క్యాల్షియం, నియాసిన్, బీటాకెరొటిన్ వంటి పోషకాలెన్నో ఉంటాయి. క్యాల్షియం ఎముకల్ని దృఢంగా చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లూ ఎక్కువే. కరివేపాకులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి శరీరంలో ఇన్ఫ్లమేషన్ను, ఇన్ఫెక్షన్లను నుంచి రక్షిస్తాయి. ఇవి వెన్నునొప్పితో బాధపడేవారికి మేలు చేస్తాయి.
వ్యాయామం అవసరం
వెన్నునొప్పితో బాధపడేవారు రోజూ కచ్చితంగా వ్యాయామం చేయాలని నిపుణులు చెబుతున్నారు. ఎన్ని పనులున్నా ఎక్సర్సైజ్ చేయడానికి టైమ్ కేటాయించండి. మీ రెండు చేతుల వేళ్లతో.. మీ కాళ్ల వేళ్లను ముట్టుకోండి. ఇలా చేసేటపపుడు మీ కాళ్లు నిటారుగా ఉండాలి. వెన్ను నొప్పి మరీ ఎక్కువగా వస్తుంటే కాస్త గోరువెచ్చని నీటిలో ఉప్పు కలిపి, టవల్‌ను నీటిలో ముంచి, పిండాక దానితో వెన్నుపూసమీద కాపడం పెట్టండి. కొంతసేపటికి ఊరట కలుగుతుంది. తీవ్రమైన వెన్నునొప్పి ఉన్నవారు.. ఈ వ్యాయామం కన్న డాక్టర్ని కలవడం అవసరం.