నాని హీరోగా శైలేష్ కొలను డైరెక్షన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘హిట్ 3: ది థర్డ్ కేస్’. ‘హిట్ 1’ ‘హిట్ 2’ వంటి హిట్ సినిమాల తర్వాత ఈ ఫ్రాంచైజ్ లో రాబోతున్న ఈ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ పై మంచి అంచనాలే ఉన్నాయి. మే 1న సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. తాజాగా ఈ మూవీ నుంచి సెకండ్ సాంగ్ ను రిలీజ్ చేసారు. అలానే ట్రైలర్ అప్డేట్ అందించారు. ఇప్పటికే రిలీజైన రెండు చిత్రాలు మంచి హిట్ అవ్వడంతో, పార్ట్-3పై అభిమానుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. దీనికి తగ్గట్టుగానే ఆల్రెడీ విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ఆకట్టుకుంది. ‘ప్రేమ వెల్లువ’ అనే మెలోడీ సాంగ్ అలరించగా.. తాజాగా ‘అబ్కీ బార్ అర్జున్ సర్కార్’ అనే సెకండ్ సింగిల్ ను లాంచ్ చేసారు. ఈ పాట ‘హిట్ 3’ సినిమాలో అర్జున్ సర్కార్ పాత్ర స్వభావాన్ని వివరిస్తోంది. హీరో క్యారక్టరైజేషన్ తో పాటుగా పోలీసాఫీస్ గా అతని ఫెరోషియస్ ఎనర్జీని తెలియజేస్తోంది.
లిరికల్ వీడియో అయినప్పటికీ సినిమాలోని కొన్ని వైలెంట్ షాట్స్ ను చూపించారు. నాని తన స్క్రీన్ ప్రజెన్స్ తో ఆకట్టుకున్నాడు. అర్జున్ సర్కార్ రోల్ కు సరిగ్గా సూట్ అయ్యాడు. ఓవరాల్ గా ‘అబ్కీ బార్ అర్జున్ సర్కార్’ సాంగ్ కు మూవీ లవర్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక పాట చివర్లో మేకర్స్ ‘హిట్ 3’ ట్రైలర్ అప్డేట్ ను అందించారు. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని మే 1న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. ఇందులో నాని సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా, యునానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై ప్రశాంతి తిపిర్నేని ఈ సినిమాని నిర్మిస్తున్నారు. దీనికి సాను జాన్ వర్గీస్ డీవోపీగా, శ్రీ నాగేంద్ర తంగాల ప్రొడక్షన్ డిజైనర్ గా వర్క్ చేస్తున్నారు. కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ చేస్తున్నారు. ‘దసరా’ ‘హాయ్ నాన్న’ ‘సరిపోదా శనివారం’ వంటి హ్యటిక్ హిట్స్ తో ఫుల్ ఫార్మ్ లో ఉన్న నాని.. ఈసారి ‘హిట్ 3’తో ఎలాంటి సక్సెస్ సాధిస్తారో చూడాలి.