ఈనెల 27న ‘లూసిఫర్‌2: ఎంపురాన్‌’

మోహన్‌ లాల్‌ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్ట్ చేసిన చిత్రం ‘లూసిఫర్‌2: ఎంపురాన్‌’. 2019లో వచ్చిన లూసిఫర్ సినిమాకి ఇది సీక్వెల్‌గా రూపొందింది. ఈ సినిమా అప్పట్లో పెద్ద విజయం సాధించింది. ఆ చిత్రానికి సీక్వెల్ కావడం, ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్‌లకి సూపర్ రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ని కూడా రిలీజ్ చేశారు.

“మనిషి ప్రాణం కంటే ఏదీ విలువైంది కాదు” అంటూ ట్రైలర్‌లో వచ్చిన డైలాగలు ఆకట్టుకుంటున్నాయి. లూసిఫర్‌లో ప్రధాన పాత్ర అయిన స్టీఫెన్ గట్టుపల్లి అసలు ఎవరు? ఒక సాధారణ ఎమ్మెల్యే అయిన స్టీఫెన్‌ చూసి ముంబై మాఫియా నుంచి ప్రపంచంలోనే అతి పెద్ద ఏజెన్సీలు ఎందుకు భయపడుతున్నాయి అనే ప్రశ్నలకు లూసిఫర్ 2లో సమాధానాలు దొరకబోతున్నాయి. ఇక ఈ చిత్రంలో మంజు వారియర్, టోవినో థామస్ సహా పలువురు కీలక పాత్రల్లో నటించారు. మార్చి 27న ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది. తెలుగులో దిల్ రాజు నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తుంది.

‘లూసిఫర్‌ 2’ మూవీ తెలుగు ట్రైలర్ ను ప్రభాస్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ లో షేర్ చేశారు. ”మాగ్నమ్ ఓపస్ ‘L2: ఎంపురాన్’ ట్రైలర్ మైండ్ బ్లోయింగ్ గా ఉంది. వన్ అండ్ ఓన్లీ మోహన్ లాల్, నా వరదా పృథ్వీరాజ్ సుకుమారన్ కలిసి 2025 మార్చి 27 నుండి ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో తుఫాను సృష్టించబోతున్నారు” అని రాసుకొచ్చాడు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రానికి డార్లింగ్ సపోర్ట్ గా నిలవడంతో, రెబల్ స్టార్ ఫ్యాన్స్ నుంచి ఈ సినిమాకి మద్దతు లభించే అవకాశం ఉంది.

జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంపురాన్‌ని ప్రమోట్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. గతంలో ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ అనే సినిమాలో మోహన్ లాల్ నటించారు. ఈ చిత్రంలో తారక్ పెద్దనాన్న పాత్రలో లాల్ కనిపించారు. దీంతో ఎంపురాన్ మంచి విజయం సాధించాలని కోరుకుంటూ తారక్ ఫ్యాన్స్ ప్రమోట్ చేస్తున్నారు.

Scroll to Top