‘కుబేర’లో ధనుష్, నాగార్జున


ధనుష్, నాగార్జున ప్రధాన పాత్రల్లో ‘కుబేర’
*జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల

డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘కుబేర’. ఇందులో ధనుష్ హీరోగా నటిస్తుండగా.. కింగ్ అక్కినేని నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ యాక్టర్ జిమ్ సర్బ్ కూడా ఓ కీ రోల్ లో కనిపించనున్నారు. ఇప్పటికే వచ్చిన ప్రధాన పాత్రల లుక్స్, క్యారక్టర్ పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే సినిమాని ఎప్పుడు విడుదల చేస్తారో అని సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ను లాక్ చేసారు.

‘కుబేర’ చిత్రాన్ని 2025 జూన్ 20న వరల్డ్ వైడ్ గా థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లుగా మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేసారు. ఇదొక పవర్ స్టోరీ అని, సంపద కోసం జరిగే యుద్ధమని, విధి ఆడించే ఆట అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ ను షేర్ చేసారు. దీంట్లో నాగార్జున, ధనుష్ ఎదురెదురుగా నిలబడి ఒకరినొకరు ఇంటెన్స్ గా చూసుకుంటున్నారు. మధ్యలో జిమ్ సెర్బ్ ని కూడా ప్రెజెంట్ చేసారు. బ్యాగ్రౌండ్ లో ఓ మహా నగరాన్ని సర్కిల్ ఆకారంగా చూపించారు.

లవ్ స్టోరీ’ తర్వాత శేఖర్ కమ్ముల మూడున్నరేళ్ల గ్యాప్ తీసుకొని చేస్తున్న సినిమా ‘కుబేర’. తన జోనర్ నుంచి బయటకు వచ్చి, కంప్లీట్ గా డిఫరెంట్ స్క్రిప్ట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్స్ ధనుష్, నాగ్ నటిస్తుండటంతో అందరిలో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ‘కుబేర’ అని టైటిల్ పెట్టి ధనుష్ ను ఒక బిచ్చగాడి గా చూపించడం అనే పాయింట్ ఎగ్జైటింగ్ గా ఉంది. అందులోనూ రష్మిక ఈ మధ్య బ్యాక్ టూ బ్యాక్ బ్లాక్ బస్టర్స్ తో ఫుల్ జోష్ లో ఉంది. నేషనల్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ కంపోజర్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. ఇవన్నీ ఇప్పుడు కుబేర చిత్రానికి కలిసివస్తాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Scroll to Top