విశ్వంభర – తుదిమెరుగులు


తుదిమెరుగులు దిద్దుకుంటున్న విశ్వంభర

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విశ్వంభర’. వశిష్ట దర్శకత్వంలో ఈ సోషియో ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ తెరకెక్కుతోంది. సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఈ సినిమాని ‘గేమ్ ఛేంజర్’ కోసం వాయిదా వేసుకున్నారు. ఇంకా న్యూ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయలేదు. ఈ మూవీ అప్డేట్ కోసం మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏదైనా ప్రమోషనల్ కంటెంట్ విడుదల చేసి, సినిమాపై బజ్ క్రియేట్ అయ్యేలా చేయాలని కోరుకుంటున్నారు.

‘విశ్వంభర’ సినిమాకు సంబంధించిన టాకీ పార్ట్ దాదాపు పూర్తయింది. రెండు సాంగ్స్, కొంత మేర ప్యాచ్ వర్క్ మాత్రమే పెండింగ్ ఉన్నాయి. అయితే ఇప్పుడు చిరంజీవి ఇంట్రడక్షన్ సాంగ్ ని షూట్ చేస్తున్నారు. ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్ గా వెల్లడించారు. ఈ సందర్భంగా మెగా పోస్టర్ ను షేర్ చేశారు. ఇందులో చిరు జీప్ డోర్ ఓపెన్ చేస్తూ కనిపించారు. బ్లాక్ గ్లాసెస్ పెట్టుకొని స్టైలిష్ గా ఉన్నారు. ఎంఎం కీరవాణి కంపోజ్ చేసిన సెన్సేషనల్ ట్యూన్‌కు మెగాస్టార్ స్టెప్పులు వేయడం చూడటానికి విజువల్ ట్రీట్ గా ఉంటుందని పేర్కొన్నారు. ఈ పాటకు శోభి మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నట్లు తెలిపారు.

విశ్వంభర’ చిత్రంలో చిరంజీవి సరసన త్రిష కృష్ణన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఆషిక రంగనాథ్, కునాల్ కపూర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. యువీ క్రియేషన్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. విజువల్స్ ఎఫెక్ట్స్ మీద ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు. ఆల్రెడీ రిలీజైన టీజర్ లో సీజీ వర్క్ పై విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. ట్రైలర్ తో అన్నిటికీ సమాధానం చెప్పాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మే లేదా జూన్ నెలలో ఈ మూవీని విడుదల చేస్తారనే ప్రచారం జరుగుతోంది.

Scroll to Top