టాలీవుడ్ హీరో మెగాస్టార్ చిరంజీవి ఆరు పదుల వయసులోనూ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్నారు . ఈ మధ్య కాలంలో ఆయన మరింత వేగంగా ప్రాజెక్టులు పట్టాలెక్కిస్తున్నారు. ఇలా ఇప్పటికే ఎన్నో మూవీలతో ప్రేక్షకులను, అభిమానులను మెప్పించారు. ఈ క్రమంలోనే ఇప్పుడు చిరు ‘విశ్వంభర’ చేస్తున్నారు. టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ మల్లిడి వశిష్టతో కలిసి మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న ‘విశ్వంభర’ మూవీ సోషియో ఫాంటసీ జోనర్లో రూపొందుతోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 10వ తేదీన సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతుంది.
ఇందులో హీరో పలు లోకాలను చుట్టి వచ్చే వీరుడిగా నటిస్తున్నారు. దీంతో ఈ చిత్రంపై అంచనాలు ఓ రేంజ్లో నెలకొన్నాయి. అందుకు అనుగుణంగానే ఈ మూవీని నెక్ట్స్ లెవెల్‌గా రూపొందిస్తున్నారు.
విజువల్ వండర్‌గా రూపొందుతోన్న ‘విశ్వంభర’ మూవీకి సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ కొద్ది రోజుల క్రితమే మొదలైంది. ఫస్ట్ షెడ్యూల్లోనే ఓ యాక్షన్ సీక్వెన్స్‌ను షూట్ చేశారు. ఆ తర్వాత చిరంజీవి లేని కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. అనంతరం త్రిష, సురభి, ఇషా చావ్లా తదితరులు కూడా షూట్లో జాయిన్ అవగా.. వీళ్లపై కీ సీన్స్‌ను తెరకెక్కించారు. మెగాస్టార్ చిరంజీవి కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ‘విశ్వంభర’ సినిమాను పాన్ ఇండియా రేంజ్లో పలు భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ముఖ్యంగా ఈ చిత్రంలో ఎన్నో సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్‌ను పెడుతున్నారు.
ముఖ్యంగా ఈ చిత్రంలో ఆయన వేసే హుక్ స్టెప్స్ ‘ఇంద్ర’, ‘ఠాగూర్’, ‘ఖైదీ నెంబర్ 150’ చిత్రాలను మించిపోయేలా ఉంటాయట. ఇప్పటికే కీరవాణి వీటికి ట్యూన్స్ కూడా ఇచ్చేశారని తెలిసింది. అంటే.. అవి హిట్ అయినట్లే ఈ మూవీ కూడా చిరంజీవికి సక్సెస్ తెచ్చిపెడుతుందేమో చూడాలి.