శ్రావణ మాసం లో మన అందరి ఇళ్ళల్లో ఎక్కువగా ఉండేవి నానబెట్టిన శనగలు.( అందరూ పేరంటాలలో ఇస్తారు కదా, ఈ శనగలతో మంచి పోషకాహారం చేసుకోవచ్చు. ఈ వంటకం పేరు “పాఠోళీ”. ‘Carbohydrates’ అతి తక్కువగా వుండి, Fibre ఎక్కువగా ఉండే వంటకం!
పది నిముషాలలో తయారుచేసుకోవచ్చు. మేము ఇంట్లో చేసుకునేవిధానం ఇక్కడ మీతో పంచుకుంటున్నాను.
కావలిసిన సామాగ్రి :
1. నానబెట్టిన శనగలు – 4 కప్పులు (పేరంటంలో ఇచ్చిన శనగలు నానబెట్టినవే కాబట్టి అవే వాడుకోవచ్చు. లేదంటే పొడి శనగలు ఒక రాత్రి నానబెట్టాలి)
2. ఉల్లిపాయ – పెద్ద సైజు ఒకటి
3. పచ్చిమిరపకాయ – పెద్దది ఒకటి
4. పోపుసామానులు ( 1 spoon- శనగపప్పు, ½ spoon -ఆవాలు, ½ spoon – జీలకర్ర, ఒక రెబ్బ కరివేపాకు)
5. ఉప్పు – తగినంత
తయారుచేసే విధానంః
1. ముందుగా, సగం శనగలకు పైన ఉండే తొక్క తీసుకోవాలి (తీయకపోయినా ఫరవాలేదు కానీ fibre ఎక్కువగాఉంటుంది. )
2. ఉల్లిపాయను చిన్న ముక్కలుగా తరగాలి.
3. ఇప్పుడు, మిక్సీ లో శనగలు, పచ్చి మిరపకాయ, సగం ఉల్లిపాయముక్కలూ ఒక్క 20 సెకండ్లు మాత్రం తిప్పాలి. కచ్చాబిచ్చాగా మాత్రమే నలగాలి; మెత్తగా అయిపోకూడదు.
4. ఒక Pan లో రెండు చెంచాల నూనె వేసి stove మీద medium flame లో పెట్టి పోపు సామానులు వేయాలి.
5. పోపు దోరగా వేగినాకా ఉల్లిపాయ ముక్కలు ( సగం ఉల్లిపాయ ముక్కలు వేరే ఉంచాం కదా!) వేసి ఒక నిముషం వేయించి అందులో మిక్సీ లోని మిశ్రమాన్ని వేసి ఇంకొక రెండు చెంచాల నూనె , తగినంత ఉప్పు వేసి కలపాలి.
6. Sove మీద flame ను medium లోనే ఉంచి ఈ మిశ్రమాన్ని కలుపుతూనేఉండాలి ( లేకపోతే అడుగంటుతుంది)
7. 10 నిముషాలతరువాత మూతపెట్టి, stove ఆర్పేయాలి.
8. చల్లారేకా పాఠోళీ సిద్ధం!
9. ఈ పాఠోళీ కరకరలాడుతూ తినడానికి చాలా బాగుంటుంది. కొంతమంది అన్నం లోకూడా కలుపుకుని తింటారు.
—చెరుకూరి విశ్వనాథ శర్మ (మెల్బోర్న్)