గుడ్డు శాకాహారమంటున్న సైంటిస్టులు


గుడ్డును చాలాకాలంగా మాంసాహారంగానే పరిగణిస్తూ వస్తున్నారు. అయితే ఇటీవల గుడ్డుని శాకాహారంగా పరిగణించొచ్చని కొంతమంది సైంటిస్టులు భావిస్తున్నారు. అసలు గుడ్డు వెజ్జా? నాన్ వెజ్జా? దీంతో ఉండే లాభాలేంటి?. డెఫినిషన్ ప్రకారం చూస్తే జీవం ఉన్నవాటిని లేదా మాంసాన్ని తినేవారిని నాన్‌వెజిటేరియన్లుగా పరిగణిస్తారు. అయితే ప్రస్తుతం గుడ్డు విషయంలో అది వర్తించదంటున్నారు సైంటిస్టులు. ఎందుకంటే, గుడ్డులో మాంసం, జీవం రెండూ ఉండవు… గుడ్డులో కేవలం పోషకాలు మాత్రమే ఉంటాయి. కాబట్టి దీన్ని వెజిటేరియన్‌గా భావించొచ్చు అంటున్నారు.

గుడ్డులో మూడు భాగాలుంటాయి. అవి… పెంకు, అల్బుమెన్‌ (తెల్ల సొన), యోక్‌ (పచ్చసొన). తెల్ల సొన అనేది నీటిలో అల్బుమెన్‌ ప్రొటీన్‌ సస్పెన్షన్‌. అది ఎలాంటి జంతు కణాలను కలిగి ఉండదు. అందుకే తెల్ల సొన అనేది శాకాహారం. తెల్లసొనతో రూపొందే పదార్థాలన్నీ కూడా సాంకేతికంగా శాకాహారమే. తెల్లసొన కేవలం ప్రొటీన్లను మాత్రమే కలిగి ఉంటుంది. పచ్చ సొన ప్రొటీన్లు, కొలెస్ట్రాల్‌, కొవ్వులతో తయారవుతుంది. రోజూ మనం తినే గుడ్లు పిండాన్ని కలిగి ఉండవు. మార్కెట్లో లభించే గుడ్లు చాలా వరకు ఫలదీకరణం చెందనివే. అందుకే ఆ గుడ్డును తినకుండా ఉంచినా, దాని నుంచి కోడిపిల్ల బయటకు వచ్చే అవకాశాలు లేవు. అందుకే గుడ్డు వెజిటేరియన్‌గా భావించొచ్చని, పోషకాహారం కోసం రోజుకో గుడ్డు తినొచ్చని సైంటిస్టులు సూచిస్తున్నారు. మార్కెట్లో లభించే విటమిన్ సప్లిమెంట్ల కన్నా రోజుకో గుడ్డు తినడం హెల్దీ ఆప్షన్ అని వైద్యులు సూచిస్తున్నారు. గుడ్డులో విశిష్టమైన యాంటీ ఆక్సిడెంట్స్‌, శక్తివంతమైన బ్రెయిన్‌ న్యూట్రియెంట్స్‌ ఉంటాయి. గుడ్లు తినడం వల్ల మానసిక ఒత్తిడి నుంచి రక్షణ లభిస్తుంది. కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది. క్యాన్సర్‌, అల్జీమర్స్‌, పార్కిన్‌ సన్స్‌ , గుండె రోగాల వంటివి తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.

Scroll to Top