అదే స్వప్నం – అదే నిజం

ఎక్కడినన్నయ్య ! నెచటి రాజనరేంద్రు
లచ్చముగ మెలుబరు నొచ్చిరంట
ఎక్కడి పోతన్న ? ఎప్పటి శ్రీనాధు
లిక్కడ “క్యూ ” స్టేజి నెక్కిరంట

అప్పటి రాయలు అప్పటిపెద్దన
డౌనండరున విహరణములంట
ఏనాటి వేమన్న ? ఏనాటి బ్రౌ నయ్య ?
స్కౌటుహాలునకూడి మాటలంట

ఎంకి నాయుడు బావలీ యెడకొలువట
విశ్వనాధుకు శ్రీశ్రీకి విడిది యిదట
భరణి గారిందరికి యాటపాటలు యిట
సాహితీస్వప్నమొ ? నిజమొ ? జరిగెనిచట !

ఘడియ వేసము కొరకని కట్టి తొడుగు
తీసి వేయగ దిగజారు తీరు గాక
భూమికందుగల సుశీల పుష్టి తెలిసి
నరయ భువనవిజయపర మార్ధ మదియె

సూర్యనారాయణ సరిపల్లె

Scroll to Top