క్రిస్మస్ క్రిస్మస్ ,కరుణా ప్రేమా
కలగలిసిన శాంతి స్వరూపమై
ప్రశాంత రూపమై ఇలపై ప్రభవిల్లిన
ఏసుక్రీస్తు జన్మదినం ,క్రిస్మస్ .
దివి నుండి తటిల్లతగ ఒకతార
భువికి దిగి మేరి మాతకు
పుత్రోదయమై ఇలపై
వెలుగులు నిండిన దినం క్రిస్మస్ ,
కన్నె మరియ కన్నబిడ్డ,
మేరిమాత ముద్దుబిడ్డ
శాంతిదూత
ఏసు ప్రభువు ,ఇలాతలాగమనమ్.
విస్వమన్త కాంతిమయం,
విశ్వ శాంతికి అహరహం
తపించి శ్రమించి దుష్ట నికృష్ట
దుండగుల చే హతమైన విజేత
శాంతియుత మహోజ్వల తార
ఆవిర్భావం క్రిస్మస్ పుణ్యదినం,
అత్యంత బాదామయం
క్రీస్తు జీవనగమనం ,
ముళ్ల కిరీటము తలపై నుంచి
మేకులతో కొట్టి సిలువ వేసిన
దుష్టుల,తామసుల సహితము
తాను మన్నించి శిక్షింపక
క్షమియించ వేల్పుల వేడిన
దివ్య జ్యోతి స్వరూపమే ఏసుక్రీస్తు,
ఏమతమైన ఏకులమైన
ఆమోదించి అందరొక్కటై
వేడుక సేయు పర్వదినం క్రిస్మస్.
॥ ఏసుక్రీస్తు జన్మదినం క్రిస్మస్.
———————————————–
కామేశ్వరి సాంబమూర్తి .భమిడి పాటి