మాటల మూటలు కట్టు! చేష్టలు మంచివి పట్టు!
కాలపు విలువల గుట్టు! తెలిసిన మెలుకువ తట్టు!
చిల్లర భావాలు వద్దు! సుందర భావాలు ముద్దు!
తొందర పరుగులు వద్దు! నిలకడ మెరుగులు దిద్దు!
కాలం పరుగిడు నిత్యం! కాయం తరుగును సత్యం!
జీవన ప్రయాణ గమ్యం! తెలిసిన దొరుకును సారం!
మేఘం కురియును వర్షం! పుడమిన పుట్టును జీవం!
జీవం దాల్చును రూపం! వసుధన విడుచును దేహం!
కాలం మారును నిత్యం! సత్యం మారదు తధ్యం!
భౌతిక కాయము అనిత్యం! సుస్థిర మతియే ముత్యం!
–రాంప్రకాష్ యెర్రమిల్లి