నాటి నేటి తెలుగు మేటి గాధను కడు
ధాటిగా చెపుదాము తనివి తీర
కృష్ణతులాభార వృత్తాంతమును బహు
రక్తిగట్టింతము రసము లూర
తెలుగుబడి బుడుతలదగు నాటిక బాగ
అభినయమ్మాడుద మంద మొప్ప
ఉల్లము రంజిల్లు పల్లవుల మధుర
గానమ్ము చేదము కమ్మగాను
పలు కళామౌక్తికాభరణుల భరణెద
చూర గొనగ కూర్చమె కళా తోరణ మది
భువన విజయ సరసిజాత పుష్పములది
వేతము తనికెళ్ళ భరణి వేడుక కది
…. సూర్యనారాయణ సరిపల్లి