డబ్బింగ్ సినిమా చేసేటప్పుడు దానికి ప్రాణం పోయవలసినది రచయిత. అతని మాటలు, పాటలు పండాలి. ప్రేక్షకుల మన్ననలు పొందాలి. అయితే మన తెలుగు చలన చిత్ర రంగంలో మొదటిసారిగా ఒక డబ్బింగ్ సినిమాకి వర్క్ చేసిన రచయిత ఎవరో తెలుసా..?
మహాకవి శ్రీ శ్రీ.
హిందీలో వచ్చిన నీరా ఔర్ నందా అనే హిందీ సినిమాని తెలుగులో డబ్ చేసినప్పుడు ఆ సినిమాకి మాటలు, పాటలూ రాసింది శ్రీశ్రీయే. ఈ సినిమా తెలుగులో ఆహుతి పేరుతో వచ్చింది.
హిందీలో 1946 లో ఈ కానేమ వస్తే తెలుగులో మరో నాలుగేళ్ళకు అంటే 1950 లో వచ్చింది. ఈ చిత్రానికి మాధవిపెద్ది, చదలవాడ, వాళ్ళం, కనకం తదితరులు డబ్బింగ్ చెప్పారు. జయభేరి తో పేరుప్రఖ్యాతులు సంపాదించిన నిర్మాత నారాయణ రావు ఈ చిత్రాన్ని నిర్మించారు.
పడవ వాళ్లకు సంబంధించిన కథ ఇది. ఈ సినిమా అంత అవుట్ డోర్లో సాగింది. తెలుగులో ఈ డబ్బింగ్ సినిమాకు సాలూరు రాజేశ్వర రావు సంగీతం సమకూర్చారు. హిందీలో సంగీతానికి, తెలుగులో సంగీతానికి ఎక్కడా పొంతన లేదు. రిథమ్ మాత్రం లాగించి విడిగానే ట్యూన్ లు కట్టారు రాజేశ్వర రావు గారు.
—————
– జయా