ఆత్మవిశ్వాసం ఉంటే ఆకాశమే హద్దు

వెనుతిరగని వెన్నెల – ఒక సమీక్ష

ఊహల ఉయ్యాలలో విహరించే ఊసు
ఆశల కెరటాలలో తేలియాడే తలపు
మమతల దీపాలలో చలికాచుకునే మనసు
విషాదాల వేసవిలో జ్వలించే తనువు
–జీవితం గురించి ఒక కవి

ఎంత ధనవంతులైనా, బీదవారైనా ప్రతీ జీవితంలో ఎత్తు పల్లాలు ఏదో ఒక రూపంలో ఉంటాయి. ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించి జీవితం గురించి ఎన్నో అపురూపమైన కలలు గని ఎన్నో మలుపులు తిరిగి అనుకున్న గమ్యం చేరిన పాత్ర కథానాయిక తన్మయిది. అయితే ఈ నవలలో కథాంశాన్ని గురించి ఎక్కువగా చెప్పేకంటే కథాగమనం నడిపించే పధ్ధతి గురించి మాట్లాడడం బాగుంటుందని నా ఉద్దేశ్యం.

సందర్భోచితంగా పాత్రలు సృష్టించడం, అవసరమైన మేరకే సంభాషణలు కొనసాగించడం, అవకాశం ఉన్నపుడు మాండలీకాల ప్రయోగాలు, సంభాషణకు తగిన పరిశోధనాంశాలు, పాత్రకు కావలసిన వాస్తవికమైన ఆలోచనా దృక్పధం – ఇలా ఎన్నో సమున్నతమైన లక్షణాలతో ఈ నవల బలమైన కథా వస్తువుగా తీర్చిదిద్దుకొంది.

చదివే వారికి ఆసక్తి కోల్పోకుండా కథలో ఎప్పటికప్పుడు శక్తినింపుతూ నడిపించిన గీత గారు రచనారంగంలో అందెవేసిన చేయి అనే చెప్పాలి. భూమి మీద దేవగన్నేరు పూలు, ముత్యపు చినుకుల్లా నిలచిన నీహారికలు, ఆకాశంలో నక్షత్రాలు, మధ్యలో ఎగిరే పక్షులు, ఆకాశానికి ఎదగాలనే సన్నజాజి తీగెలు, గోదారి గట్టులు, గలగల పారే సెలయేళ్ళు, ఎంతోమంది కవుల కవితలు, సందర్భానుసారంగా సమ్మిళితం చేసి వర్ణానాంశాలను పొందుపరిచారు. రచయిత్రి గీత గారు చాలా సందర్భాలలో తన విశ్లేషణాత్మక సందేశాలను చాలా సున్నితంగా వివరించడం ఈ నవలలో ఉన్న ప్రత్యేకత.

పల్లెల్లో ఉన్న పరిసరాలు, అక్కడి వాతావరణం, అలాగే పట్టణాలలో ముఖ్యంగా విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం, సముద్రపు అలల తరంగాల సవ్వడులు, హాస్టల్ వాతావరణం, సినిమా కోర్టులకి బయటి ప్రపంచానికి కనిపించే వ్యత్యాసం ఎంతో నిశితంగా చిత్రీకరించారు.

ఆత్మ విశ్వాసం ఉంటే సాధించలేనిదేదీ లేదని ఒక మహోత్కృష్టమైన సందేశాన్ని చక్కని కథాంశంతో రచయిత్రి చెప్పారనడంలో సందేహం లేదు.

1970-80 దశాబ్దాలలో వచ్చినన్ని నవలలు కనబడడం లేదు. రచయితలు వ్రాయడం లేదా లేక పాఠకులు తక్కువైపోయారా? చాలా రోజుల తరువాత ఇంత సుదీర్ఘమైన అందునా కథానాయిక ప్రాముఖ్యత గల నవల రావడం మరియు దీనిని ప్రచురించిన శ్రీ వంగూరి ఫౌండేషన్ అధినేత చిట్టెన్ రాజు గారికి అభినందనలు తెలియపరచుకోవాలి. ప్రతీ ఒక్కరు తప్పకుండా చదవాల్సిన నవల.

Book your copy today. Limited copies only available:
Book Price: Rs. 300.00 (India) (Hard Bound)
US $ 25.00 (USA) (Hard Bound)
*Postal/Courrier Charges Extra

For Books Contact:
నెచ్చెలి వనితా మాస పత్రిక:
editor@neccheli.com
ఫోన్: +91 79957 33652 (INDIA)
(or)
ఫోన్:+1408-483-7700 (USA)

పుస్తకాలు దొరుకు ఇతర చోట్లు:
J.V. Publications (Jyothi Valaboju)
Phone: 80963 10140
(or)
Vanguri Foundation of America: Vamsee Ramaraju (Hyd.)
Satya Sai Puram, Kuntloor, Abdullapurmet (M),
R.R. Dist.-501 505. T.S. India
Ph: +91 98490 23852, E-mail : ramarajuvamsee@yahoo.co.in
(or)
Navodaya Book House, Hyderabad. 040-2465 2387
(or)
E-Book: Kinige and Amazon
or)
Vanguri Foundation
Tax Deductible U.S Federal tax ID: 76-0444238

Scroll to Top