మసక మసక ఎలుతుర్ల ,
ఎల్లి,
మట్టి గాజుల సప్పుల్లు ,
కసవ సిమ్ముటు నాఎల్లి ,
కిసుక్కున నవ్వింది ॥మసక ॥
బద్దకంగా మంచాన కూకుని ,
అందాల నా ఎల్లిని
ఓరగా సూత్తున్న నాను,
ఏటే ?ఎల్లి సంగతేటనడిగితే ,
తల వొంచి యెల్లి నల్లని కంటి రెప్పలు ,
రెప రెప లాడిస్త సూసింది నేలకాసి ,॥ మసక॥
రేతిరి కొప్పులోనేనె ట్టిన ,
బొండుమల్లి పూలన్ని నెల రాలి ,
బేలగా సుసేయి ,యెల్లిని ,
ఎల్లి నావొంక గమ్మత్తుగా సూసింది ,
ఆసూపుకే నావొల్లంత జిల్లుమంది ,॥మసక॥
కసవూడిచి కల్లాపి జల్లి {పేడ కలిపిన నీల్లు }
సుక్కల ముగ్గులు ,సక్కంగ దిద్ది
సటుక్కున పంచదూరి ,
కడవనెత్తినెత్తి కాలి కడియాలు ,
సేతిగాజులు గళ్ళు గళ్ళు మని
సందళ్ళు సేత్తుండ
నీలాటి రేవు కెల్లోత్త మావా అంటు ,
చక చకా నడిసి పోయింది నాయెల్లి. ॥మసక॥
మెల్లిగా మెల మెల్లగా ,
పంచె కొంగు పైకేగ్గట్టి
తుండు గుడ్డ తలకి సుట్టి
అడుగులో అడు గేసుకుంటు ,
ఎల్లి ఎనకాలబడి
నీలాటి రేవు జేరిన
నాకు జలకాలాడే నాఎల్లి జలకన్నెల ఆపడ్డది ॥మసక ॥
ఏటిలో ముంచిన కడవ నీల్లతొ సంకనెట్టి ,
తడిసినకోక తడబడుతుంటే ,
అడుగులేసే నాఎల్లి
అందాలు నాగుండెల్ల గుబులు రేపాయి,
పక్కన జేరి నాను గక్కున ,
కదవండుకుని సాయమందీయ బోతే ,
కసురుకుని విసుగుకుని ,
ఎటి మావా ఏటి
ఎవురే సూత్తే ఎటి ఈయిన్త మొగుడిసేత ,
నీళ్ళు మోయి త్తాంది,
అని ముక్కు న ఎలెట్టేరు ,
అంటూ నన్ను పక్కకు నేట్టేసింది ,
ఎల్లి నాబంగారు ఎల్లి,
————————————–
కామేస్వరి సాంబమూర్తి .భమిడిపాటి.