నా కళ్ళ నుంచి నిద్రను దోచుకున్న నా మధురమైన ఉగ్రవాదివి నువ్వు….
ఎప్పుడూ నీ పేరు రాస్తూ స్మరించుకునే న మనసు క్షేమమే….
అలాగే నా ఊహలకు తగినట్టు తపించేనా నీ మనసు అని తెలుసుకోవాలనుకుని ఆరాటపడుతున్న నా మనసు పదిలమే…
నువ్వు నాకు పరిచయమైంది ఒక కవితలాగానే…
మాటలకే అంతు చిక్కని అన్ని విషయాలనూ నీ చూపులలో నింపి తీసుకొచ్చావు నాలోకి.
కవితకు ఊహలు అందమా….లేక భావాలు అందమా అని నేను ఆలోచిస్తూ తడబడుతున్నది నువ్వు తెలుసుకున్నావు….
కవితకు ప్రేమ, శృంగారం అందమైనవని నువ్వు చెప్పడంతో నిన్నే నీ మాటలతోసహా దోచుకున్నాను. ఆ తర్వాత నా కవితలకూ నీ కళ్ళకూ మధ్య ఉన్న దూరంలో నీకూ నాకూ అయిన మన ప్రేమ అణువణువూ పెరిగింది.
నేను నిన్ను ప్రేమించడం మొదలుపెట్టినప్పటినుంచి నేను పూస్తున్నాను. నువ్వు పరిమళి స్తున్నావు….నువ్వు కనురెప్పలు తెరుస్తావు….నేను చూస్తున్నాను….
ఒక్క క్షణం నిన్ను అనుకోకున్నా ఆ క్షణంలో చెయ్యకూడని పెద్ద తప్పే చేసినట్టు నా మీద నాకే కోపం వస్తుంది….
చెయ్యని కుండలో నీళ్ళు తీసుకురావడానికి లేదా తవ్వని బావిని వెతుక్కుంటూ నువ్వు వెళ్తే చాలు ఆకాశమే లేని ఊళ్ళో సైతం వర్షం కురుస్తుంది….
ఇదే ప్రేమనే నీ కళ్ళు రాసిన కవితలను చదివిన తర్వాత నీ పై మరింత నేను పెంచుకున్న ప్రేమతో ఉంటున్నా….
నువ్వు కళ్ళకు కాటుక రాస్తే
నీ కళ్ళు కవితలు రాస్తున్నాయి…..
ఇంతకూ మీ ఇద్దరిలో ఎవరు కవి? అని ఇప్పటిదాకా నాకు తెలీలేదు….
కానీ మీ ఇద్దరూ నన్నే కాగితంగా చేసుకుని రాస్తున్నారు కవితలు….
కవితలతో ప్రేమ ముస్తాబవుతోందా?
లేక ప్రేమతో కవిత ముస్తాబవుతోందా?
అనే నా సంశయానికి ఇప్పటికీ తగిన జవాబు దొరకలేదు….
అవి రెండూ విడదీయలేనివి….
నీ కవితల స్థాయికి పోటీగా నీకోసం ముద్దులను పెదవుల నిండా దాచుకున్నాను. నువ్వు సయ్యంటే ఇవ్వడానికి పెదవుల తాళం తెరుస్తాను…
ఉండనా మరి…..
———–
జయా