దేహి వలెనే నిల్చు దేహంబు నిక్కముగ
దేహి లేని దేహంబు ధగ్థమౌను చితిన్
జీవమున్న క్షణమె జీవిత మాధుర్యంబు
జీవకోటి కంతకు జీవమే ఆధారంబు
జీవితమున ప్రాప్తించు కష్ట సుఖములు రెండుయు
సుస్థిరమతి సంప్రాప్తించు సమదృష్టియు శాంతియు
దొడ్డమానులను కూల్చు ఫెనుతుఫాను కదలికలు
మేటిపర్వతంబులను తాక మటుమాయమౌనుగా!
–డా.రాంప్రకాష్ ఎర్రమిల్లి