ఆనాటి ప్రధాని శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి ,
అవిరలకృషి చిరస్మరణీయం ,
భరతమాత కీర్తి కిరణం ॥ మాతృభూమిని॥
జైజవాన్ -జైకిసాన్
నినాద స్పూర్తితో ,
సైనికవీరుల,కర్షకజనులను,
ఉరకలు వేయించి ఉత్తేజపరచి
అహరహం శ్రమించి
అనతికాలమున భరతమాత ,
కలిమి,బలిమి జవాన్ జై కిసాన్ .
————————-
మాతృ భూమిని స్వర్ణ భారతిగ
తీర్చదిద్ద నెంచిన స్వార్దమెరుగని
నిరాడంబర అమరజీవుల పెంచిన శాంతి దూతగా
నేటి నాయక ప్రభంజనమంతా మరచిన
నిస్వార్ధ నిరాడంబరజీవి
శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి
జై జవాన్- జైకిసాన్ స్పూర్తి దాత ,
అమరుడైన మహామనీషి
శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి ॥ జై జవాన్ జై కిసాన్॥
జన్మభూమిని పరిరక్షింప ,
వీరతిలకముదిద్ది కన్నీటి వీడుకోలు తో
కట్టుకున్న ఇల్లాలు ,కన్నవారు,
కదనరంగమునకంప,
కణ కణ లాడు అగ్నిసిఖలవోలె
ఎగిసి ఎగిసిపడి విజయమో
వీర స్వర్గమొ యని
శత్రు మూకల దునుమాడు సైనికులు॥ జై జవాన్ ,॥
మాత్రు భూమి రక్షణె తక్షణ కర్తవ్యమని
మాతాపితరులు.
ప్రియురాలు అనుంగుబిడ్డలు
ఆత్మీయులందరి నెడబాసి,
కదనరంగమున వీర విహారము సేయు ,
వీరజవానులకిదే వందనం ॥ జై జవాన్- జైకిసాన్ ॥
రేయనక పగలనక రాయి రప్పలు,
గట్లు పుట్టలు,గతుకులు గోతులు,
ఎత్తు పల్లాలు ,కంచె ,కంటకలములనక, తిరిగి,
ఆకలి దప్పులు ,నిద్రాహారముల వీడి ,
నక్కివున్న వైరి మూకల చెండాడు ,
వీరుల కిదే వందనం ,॥ జైజవాన్ జై కిసాన్ ॥
అన్నదాతగా ఖ్యాతి గాంచిన
కర్షక మహాశయులు
కాడిపట్టి పుడమి దున్ని
కండలు కరిగించి పండించు పంటలు ॥ జైకిసాన్॥
ఎండల మాడి వానల డస్సి ,
విత్తుల నాటి పైరుల పండింఛి ,
ఇంటికి చేర్చి
నిలువెత్తు గాదెల నిండుగా నింపి ,
మానవకోటి ఆకలి దీర్చు అన్నదాతలు ,నేడు
॥ ఇక్కట్ల పాలై అప్పులఊబిలో ములిగి
దిక్కు తోచక ఆత్మ హత్యల పాలగు రైతన్నల కివే
జోహారులు || జైకిసాన్ ॥
వీర జవానులకు ,అన్నదాతలు ,జోహార్ జోహార్
అమరజీవి లాల్ బహదూర్ శాస్త్రి కి జోహార్
——————————————————————-
కామేశ్వరి సాంబమూర్తి .భమిడి పాటి