న్యూ జీలాండ్ తెలుగు శతకం గురించి…
భూతలానికి తలమానికమైన న్యూ జిలాండ్ దేశంలో తెలుగువాణి జనవాణిగా జయజయ ధ్వనులు చేస్తున్న సందర్భంగా గుండె లోతుల్లోంచి వెల్లువెత్తిన భావాలు అక్షర రూపం దాల్చి శబ్ద తరంగాలై ఒక శతకంగా తీర్చిదిద్దుకొని పుస్తక రూపంలో న్యూ జిలాండ్ మరియు ఆస్ట్రేలియా మొదటి సాహితీ సదస్సు వేదికగా ఆవిష్కరణ జరగడం ఒక మహత్తర ఘట్టంగా భావిస్తున్నాను.
శ్రీ పథోదయసంధ్యావిశేషకాంతిఁ
నిరతమాదిగ దర్శించు నేలఁజేరి
జనులు భాషాభిమానులై జయములిడగఁ
నిలిచి న్యూజిలాండు మదిలోన్ తెలుగు వెలుగు !!
‘శ్రీ’ పదంతో ఓంకారానికి శ్రీకారం చుట్టి సంధ్యా విశేష కాంతిని మొదటిగా దర్శించే న్యూ జిలాండ్ తెలుగువారు భాషాభిమానులై ఈ సాహితీ సదస్సు నిర్వహణ ద్వారా అమ్మ భాషకు అందలం పట్టి జయజయ ధ్వానాలు పలికుతున్నారని కవి శ్రీ కళ్యాణ్ గారు ఎంత మధురంగా వర్ణించారు!!!
గిరులు ఝరులతో సురవనకీర్తి మించు
తరులతాపూర్ణ రమణీయధాత్రి యైన
మన “కివీ” నేల సొగసుఁ గనుచు మురిసి
నిలిచి న్యూజిలాండు మదిలోన్ తెలుగు వెలుగు
కొండలు, కోనలు, సెలయేళ్ళతో ఇంద్రలోకాన్నే మించిపోయినటువంటి రమణీయమైన భూమి అని మన ‘కివీ’ నేలను వర్ణించి ఇక్కడి తెలుగువారు ఎంత అదృష్టవంతులోనని చాటిచెప్పారు.
పరదేశంలో నివసిస్తూ పర సంస్కృతితో సహవాసం చేస్తూ మన భాషా సంస్కృతుల పట్ల ఉన్న అపారమైన గౌరవంతో బ్రతుకు పరదేశవాసమున్ పంచియిచ్చెఁ
చదువు పరభాషనే నేర్పి జగతిఁజూపె
పరము మాతృభాషాసేవ పథము నుండె
నిలిచి న్యూజిలాండు మదిలోన్ తెలుగు వెలుగు
అని మన భాషలోని గొప్పతనాన్ని వినసొంపుగా విశదీకరించారు.
తేనెలొలుకు తేటగీతులతో న్యూజిలాండు ప్రకృతి, త్రిమూర్తి తత్త్వం, తెలుగు భాష, (తెలుగు) జాతి గుణాలు ప్రవాసులకు అన్వయిస్తూ ఒక నదీ ప్రవాహంలా సాగిన ఈ సాహితీ ఝరి తెలుగువాడు సగర్వంగా ‘ఝరీ’ అంచు పంచె కట్టి మెడచుట్టూ ఉత్తరీయాన్ని వేసుకుని నడివీధిలో నడుస్తున్నట్లుంది.
కొంత కాలంగా మన భాష వన్నె తరిగి మన్ననకొరవడి చిన్నబోయిందని అందరూ అనుకుంటున్న రోజుల్లో మాతృ భూమికి 10, 000 కిలోమీటర్ల దూరంలోనున్న న్యూ జిలాండ్ దేశంలో జరుగుతున్న మొదటి సాహితీ సదస్సు సందర్భంగా అమ్మ భాషకై పరితపించు ఇక్కడి తెలుగువారి గురించి వ్రాసినది …
పరుగులుద్యోగ బాధలున్ బ్రతుకుఁనిండి
శ్వాసతీయనైనన్ లేని క్షణమునందు
మాతృభాషకై తపియించు మాన్యులుండఁ
నిలిచి న్యూజిలాండు మదిలోన్ తెలుగు వెలుగు
ఇలా వ్రాసుకుంటూ పొతే ఇదే ఒక ఉద్గ్రంధమౌతుంది. ఈ మధ్యనే అమెరికా నుండి ఆస్ట్రేలియా వచ్చి ఇక్కడ సాహితీ సంక్షేమానికి సరిక్రొత్త కాపుగా నిలిచారు కళ్యాణ్ తటవర్తి.
గత పదిహేనేళ్ళుగా ఆస్ట్రేలియా మరియు న్యూ జిలాండ్ దేశాలలో సాహితీ వ్యవసాయం చేసే అవకాశం కలిగిన నాకు ఈ ముందుమాట వ్రాసే అవకాశం కల్పించినందులకు శ్రీ కళ్యాణ్ గారికి శుభాభినందనలు, శుభాశీస్సులు.
ప్రతీ ఏటా ఈ సాహితీ కార్యక్రమం ఒక వేడుకగా జరగాలని అభిలషించే ఇక్కడి తెలుగువారికి కళ్యాణ్ రచనలు స్పూర్తిదాయకం కావాలని ఆశిస్తూ…
మల్లికేశ్వర రావు కొంచాడ
తెలుగుమల్లి సంపాదకులు
భువనవిజయ సమన్వయకర్త
ఈ పుస్తకం ఈ క్రింది లంకెలో దొరుకుతుంది:
http://www.lulu.com/content/e-book/new-zealand-telugu-satakam/25551749
రచయిత గురించి….
తటవర్తి శ్రీ కళ్యాణ చక్రవర్తి.
నివాసం : మెల్బోర్న్ , ఆస్ట్రేలియా.
స్వగ్రామం : గోవూరు(కొవ్వూరు) , పశ్చిమగోదావరి.
ఉద్యోగం: క్లౌడ్ కంప్యూటింగ్.
Lkg నుండీ ఇంగ్లీషు మీడియంలో చదివి , సాంకేతిక విద్యనభ్యసించి , బహుళజాతి కంపెనీల్లో వివిధ బాధ్యతలు నిర్వహిస్తూ , ఇంగ్లీషు కవితా పోటీల్లో బహుమతులు గెలుస్తూ ,
మాతృభాష మీద ఎనలేని మక్కువతో ఛందోబద్దంగా పద్యరచన చేస్తూ
ప్రవాస పద్య శతక కర్తగా గుర్తింపు పొందిన యువకవి కళ్యాణ్ తటవర్తి కలం నుండి జాలువారిన మరొక పద్యశతకం ‘న్యూజిలాండ్ తెలుగు శతకం’ , ప్రవాస దేశంపై ప్రవాసంలో ఉన్న తెలుగుకవి వ్రాసిన మొదటి శతకం
కళ్యాణ్ ఇతఃపూర్వం ఉన్నది ఒర్లాండో అమెరికా..
శతకాల పట్టిక:
దైవం::
మాధవీయము – ముద్రితము
శారదాంబికా – పూర్తి , ముద్రణ
పలివెల లింగా – పూర్తి , ముద్రణ
శ్రీరామ భక్తాగ్రణీ – రచన
షిరిడీ సాయీ – రచన
కృష్ణ నామ కీర్తన – రచన
వేంకట రామా – పూర్తి , అముద్రితము
సప్తగిరి నివాస – రచన
భాష::
మాతృభాషేశ్వరీ – రచన
తెలుగు భాషా సహస్రం – రచన
న్యూజిలాండు తెలుగు – ముద్రితము
మామూలు :
సరదా శతకం – ముద్రితము
ఫ్లోరిడా శతకం – రచన
రాజకీయం శతకం – రచన
పద్యనాటకాలు list : రచయిత , దర్శకత్వం
భువనవిజయాలు : మొత్తం
1 orlando
2 NATS , Chicago
3 Tallahassee
Bhuvanavijayam : రామరాజభూషణునిగా
4 Atlanta
పద్యనాటకాలు :
వీరి కలంనుండి ప్రౌఢ శైలిలో..
1.మౌర్యచరితం.
2.మయసభ .
3.తెలుగు మరువకురా తెలుగోడా.
పదులసంఖ్యలో సాహితీ ప్రసంగాలు అమెరికాలో
మొట్టమొదటి ప్రసంగం , రామరాజభూషణ సాహిత్య పరిషత్ భీమవరం ( ఇంజనీరింగ్ 3 rd year lo)
Study : Electronics engineering , Bheemavaram , SRKR college