ప్రియమైన చిలిపి అనే రాయాలనిపిస్తోంది నువ్వు చేసిన గాయం తీవ్రమైనదైనా…
మన్నించు నన్ను…
ఓపిక చేసుకుని ఈ నాలుగు మాటలూ చదువు…
నీ నుంచి ఒక్క ఉత్తరం లేదు. ఏమయ్యావు. నన్ను అనుకోకుండా నాకు ఉత్తరం రాయకుండా ఇన్ని రోజులు ఉన్నావా?
నీ ఉత్తరాన్ని హత్తుకున్నప్పుడల్లా నాకెంత ఆనందమో చెప్పలేను.
ఆ ఆనందాన్ని దూరం చేసావు నువ్వు ఉత్తరం రాయకుండా..
నీ మాటల్లో తేనెను జుర్రుకోనివ్వు….
ఉత్తరం రాయకపోతే రాయకపోయావు…కనీసం నీ దర్శన భాగ్యమైనా కల్పించు.
నీ చూపుల లోకంలో నేను నీకు బందీనైపోతాను. అప్పుడు ఏ గొడవా ఉండదు.
నీ కోసం నిరీక్షిస్తున్నప్పుడు తెలీదు దాటుకుంటూ పోతున్న కాలం.
నువ్వు వచ్చి వెళ్ళిపోయానని చెప్పినప్పుడు నా కళ్ళు నిన్ను చూడనివ్వక చేసిన మోసానికి
ఎంతటి శిక్ష ఎలా వెయ్యాలో ఆలోచిస్తాను.
మగాళ్ళ ప్రేమ బద్దలైన అద్దంలాంటిది ….దానిని మరో అమ్మాయి అతికించినా
నీ ప్రేమ జ్ఞాపకాలు మాత్రం ముక్కలైనవి ముక్కలినట్టే ఉంటాయి. నువ్వొచ్చి వాటిని చేర్చాల్సిందే.
పుట్టినప్పుడు నేను దేనినీ తీసుకురాలేదు.
కానీ తుది శ్వాస అప్పుడు కచ్చితంగా తీసుకుపోతాను…..నీ జ్ఞాపకాలను.
ఆ రోజు నీ నీడగా నేను ఉన్నాను.
ఈరోజు, నీ జ్ఞాపకంలోకూడా నేను లేను….నిజమే లేనప్పుడు నీడ మాత్రం ఎందుకు…నాకు?
ముగింపు చుక్క కామాలా కొనసాగుతోంది విచిత్రంగా…
నా ప్రేమకు నువ్వు పులుస్తాప్ పెట్టావు కానీ నేను రాసే మాటలకు నువ్వు సంకెళ్ళు వెయ్యలేదుగా…
రూమీ అంటాడు కదా, మాటల్లేని శబ్దం ఒకటి వినిపిస్తోంది …గమనించు అని. ఆ మాటలేవో నాకోసం చెప్పినట్టు అనుకుని నువ్వేమైనా మువ్వల సవ్వడితో అడుగులో అడుగు వేసుకుంటూ వస్తున్నావని ఓ ఆశ. కానీ ఆశ నిరాశే అయ్యింది. నువ్వే చెప్పావ