ప్రాప్తస్య ప్రాప్తి

పరుగెడుతు ఉన్నాను ఏదో అందుకోవాలని …
ఏదో తరుముకొచ్చినట్లుగా పరుగెడుతు ఉన్నాను …
అలసిపోయానేమో ఎంత పరుగెట్టినా ఉన్న చోటనే ఉన్నాను …
ఎందుకో తెలియలేదు! నా గురించి నాకే బోధ పడటం లేదు!
అక్కడే నాకు తారస పడ్డాడు! ఓ మంచి మనిషి నన్ను గమనిస్తూ!
అతడే నాకు చెప్పేడు! కనువిప్పు కలిగించేడు! .నేను పరుగెట్టేది “ట్రేడ్-మిల్” పై అని?
వెతుకుతూ ఉన్నాను.. వెతుకుతూ ఉన్నాను.. దేన్నిగురించో
వెతుకుతూ ఉన్నాను! విసుగు చెందానేమో! అయినా వెతుకుతూనే ఉన్నాను!
దేనికో తెలియ లేదు! వెతికేది ఏదో నాకే బోధపడటంలేదు! అయినా..
పట్టువదలక తిరిగి ఒక పట్టుపట్టి వెతుకుతూనే ఉన్నాను! అప్పుడు
నా భార్య కంట పడ్డాను! ఏమిటి వెతుకుతున్నారు? ఎనీ హెల్ప్? అంది!
కళ్ళద్దాలు ఎక్కడ పెట్టానా అని వెతుకుతూ ఉన్నానన్నాను!
అప్పుడు ఆమె అంది! అదేమిటి మీ ముక్కు పైనే ఉన్నాయిగా! అని?
నడుస్తూనే ఉన్నాను.. దారంతా నడుస్తూనే ఉన్నాను.. గమ్యం మరచానేమో?
అనిపించినా నడుస్తూనే ఉన్నాను! అలిసిపోయనేమో! అయినా నడుస్తూనే ఉన్నాను..
అప్పుడు ఒక పాంధుడు కంట పడ్డాడు! కొంచెం ఆగు నాయనా! కూర్చో! ఈ నీళ్ళు త్రాగు!
సేద తీర్చుకో! ఈ రోట్టిముక్క తీసుకో! ఆతని మాటలు నా కెంతో నచ్చాయి!
ఆయన చెప్పినట్లు చేసాను! మనసు కొంత కుదుట పడింది! ఆతనితో అన్నాను!
మార్గం తప్పానని! మ్యాప్ మరచానని! ఆతను నన్ను చూసి నవ్వాడు!
నాయనా నీవు నిద్రిస్తున్నావు! లే! మేలుకో! నిద్ర నుంచి మేల్కొ!
అప్పుడు నన్ను నేను గుర్తించాను! నన్ను నిద్రనుంచి లేపేది నా సద్గురువని!
రాంప్రకాష్ ఎర్రమిల్లి

Scroll to Top