జాతక రత్నం – జానీ దేవ్ !

వర్కింగ్ మెన్స్ Hostel లో ఉదయపు సూర్యకిరణాలు తాకి “జానీ దేవ్ భట్ట్” కి చురుక్కుమని తాకాయి. ఈతని అసలు పేరు “జయ నీరజ్ భట్ట్” కాని స్నేహితులు తోకలు కత్తిరించి”జానీ దేవ్ భట్ట్” అని nick name పెట్టారు. ఈ పిలుపుకు”భట్ట్” విలవిల లాడి పోయాడు. తన బామ్మ పోతూ పోతూ ఎంతో ప్రేమగా పెట్టుకున్న పేరు తీరా ఈ విధంగా ఉల్టా చేయ బడిందని విచారించాడు. ఈ nick name పెట్టిన మిత్రులు అంతటితో ఆగలేదు, Hostel వంటవాడి దగ్గరనుంచి, room boy, చివరికి Hostel Warden కూడా అలాగే పిలవడం మొదలుపెట్టారు. ఎవరో వొక తుంటరి ఈ Nick Name ని తన ఆఫీసు లో కూడా తగిలించారు, దాంతో పెళ్లి కాని అమ్మయీలు ఆఫీసు లో తనని ఆట పట్టించడం మొదలు పెట్టారు. తను వుడుక్కోడం చూసి ఆందరూ వొక్కటిగా చేరి పగలబడి నవ్వడం వంటివి చెయ్యడం అలవాటైపోయింది భట్ట్ కి. మొత్తానికి తను కూడా తన పేరు జానిదేవ్ భట్ట్ అని నిర్ధారించుకునే పరిస్థికి వచ్చాడు. ఇంకా ఆ పేరే శాశ్వతంగా ముద్ర వెయ బడింది తనకి.

భట్ట్ సూర్యకిరణాల వేడి తన మొహానికి తగిలిన తక్షణమే, తన మామూలు ధోరణితో కిటికీలో నుంచి మెట్ల మీదగా కిందకు ఆశగా చూసాడు. పేపర్ బాయ్ వచ్చాడేమోనని. ప్రతిరోజు కళ్ళు తెరవంగానే దిన పత్రికలో – “తుమ్హారా కల్” అంటే “నీ రేపు”శీర్షికలో తన జాతకం చదవకుండా రోజు మొదలు పెట్టడు. దిన చర్య ఈ విధంగా మొదలై, మళ్ళ చీకటి పడే సరికి తన “దిన ఫలం” సరిగ్గా “నీ రేపు” లో రాసిన విధంగా జరిగిందో లేదోనని బేరీజు వేసుకుని చూసుకుంటాడు. వొకవేళ అల జరగా పోయినా, తను దిన పత్రిక సరిగ్గా చదవలేదని, సరిగ్గా అర్ధం చేసుకోలేదోమోనని తని తనే నిన్దిన్చుకుంటాడు. మళ్ళ మరుసటి రోజు పత్రిక లోని “నీ రేపు” గురించి కలలు కంటూ పడుకుంటాడు. రాత్రి కలలో కూడా భట్ట్ కి “దిన ఫలం” – “నీ రేపు” లోని అర్ధానికి తోడు కలలే వస్తూంటాయి. నిద్రలో ఏదో మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటాడు. యీతని ధోరణి కి విసుగెత్తిన తోటి hostel mates , వార్డెన్ కి రిపోర్ట్ చేసి వేరే rooms కి మార్చుకున్నారు. భట్ట్ వొక్కడే ఆ room లో మిగిలిపోయాడు ఆఖరుకి.

ఒకరోజు ప్రొద్దున”నీ రేపు” లో “ఈ రోజు నీవు జన్మలో మరువలేవు, ప్రతి క్షణం అనుభవించ తగ్గ రోజు” అని వుంది. భట్ట్ ఆనందానికి అవధులు లేక రెచ్చి పోయాడు. త్వరగా స్నానం , Tiffin పూర్తి చేసుకొని – ఆఫీసు కి ready అయ్యాడు.ఈ రోజు ఎమౌతుందా అని ఉత్సాహంతో నడుస్తూ ఈల వేస్తూ బయలు దేరాడు. Bus stand కి వచ్చాడు ఆఫీసు కి వెళ్దామని. తన పక్కనే వొక అందమైన అమ్మాయీ చాల సొగసుగా నిలబడి వుంది, ఆ అమ్మాయీ తొడుక్కున్న బట్టలు ఆమె అందాన్ని మరింత బయలు పెడుతున్నాయి. హట్టాత్తుగా ఆ అమ్మాయీ కెవ్వున అరిచి, పిచ్చి పిచ్చిగ గెంతుతూ, తన చ్చాతీ పై పడ్డ “సాలె పురుగుని” చూసి చాల భయపడి పోతోంది. తటాలున భట్ట్ రంగం లోకి దూకాడు, తన “దిన ఫలం” గుర్తుకు రావడంతో. ఆమె చ్చాతి పై వేయాలని కాకపోయినా, సహాయం చేద్దామని చేయి వేసి, సాలె పురుగుని దులిపే ప్రయత్నం చేస్తున్నాడు. దాంతో ఆ అమ్మాయీ మరింత భయపడి పోతూ అరుస్తూ, ఆర్తనాదాలు చేసింది. ఈ అరుపులు విని పక్కగా పోతున్న జనం మొత్తం పోగయ్యారు. విషయం చెప్పడానికి పాపం భట్ట్ ప్రయత్నించాడు వణుకుతున్న కంట్టం తో. ఇదే అమ్మాయీని మొదటిసారి తాకడం తన జీవితంలో, పాపం నిలువెల్లా వణికి పోతున్నాడు. జనం భట్ట్ చెప్పే మాటలు వినిపించుకోకుండా ఎడా, పెడా తమ శక్తి మేరకు బాదారు. ఇంతలో పోలీసు వాళ్ళు వచ్చి, అమ్మాయీ కాదంటున్న వినకుండా, భట్ట్ట్ ని Van లో తీసుకెళ్ళి, స్టేషన్ లో, మంచి నాణ్యమైన సబ్బుతో బాగా ఉతికి ఆరేసారు

మొత్తానికి ఏదో రకంగా రాత్రి ఇల్లు చేరుకున్నాడు భట్ట్. ఆయన అవతారం చూసి Hostel Warden ముసి ముసి నవ్వులు నవ్వుతూ తుర్రు మని జారుకుంది మొహం పక్కకు తిప్పుకుని. భట్ట్ కి అర్ధమైంది, వీళ్ళందరికీ అప్పుడే ఎవడో తుంటరి విషయం అంతా చెప్పి ఉంటాడని. భట్ట్ కి వొకసారి మళ్లి “దిన ఫలం” గుర్తుకు వచ్చింది, ఏది ఏమైనా ఈ రోజు “నీ రేపు” లోని జాతక ఫలం నిజమైనదే అనుకున్నాడు ఆశ్చర్యంగా.

మరునాడు paperboy యధావిధిగా”Sir ! Paper !” అని కేక వెయ్యడంతో కళ్ళు తెరిచాడు భట్ట్. గబా గబా Paper విపి, పేజీలు తిప్పి “నీ రేపు” కి చూపు మళ్ళించాడు, ఆరోజు దిన ఫలం “ఈ రోజు నువ్వు రోజంతా నవ్వుతూ గడపాలి – నవ్వు ముఖాన లేకున్నా అపాయం” అని వుంది.భట్ట్ ఖంగుతిని “ఇదెక్కడి! దిక్కుమాలు జాతకం రా ! అనుకుంటూ, స్నానాదికాలు ముగించి, Hostel Canteen కి వెళ్లి ….పగుల బడి నవ్వుతూ ! “ఆహాహాహ ! వొక ఇడ్లి, అహహ! వొక వడ!, అహహ వొక Cup Coffee ….ఆహాహ్హ! అని నవ్వుతూ అన్నాడు. Canteen లో పని చేసే అమ్మాయీ తుల్లిపడింది, భట్ట్ వొక్క ఈ కొత్త ఒరవడికి. వొక్కసారి Hostel Warden కి ఫోన్ చేసింది….”Madam ! భట్ట్ కి పిచ్చి ఎక్కింది !తొందరగా రండి ! అంది. భట్ట్ గట్టిగ “ఆహాహ్హ ! అని నవ్వుతూనే tiffin తింటున్నాడు.Warden వసంత హడావిడిగా వచ్చి, “ఏమైంది ఈ రోజు నీకు!”అంది. భట్ట్ ఆమెని ఒకసారి తేరి పార చూసి, గబుక్కున మళ్లి”అహహ” అని పగుల బడి నవ్వడం మొదలు పెట్టాడు. వసంత ఇంక ఉండ లేక గ్లాసుడు నీళ్ళు బలవంతంగా నోట్లో పోసింది, భట్ట్ నోరు మూయిద్దామని. భట్ట్ కి గొంతులో ఒక్కసారి నీళ్ళు పడడంతో పొలమారి, tiffin , coffee మొత్తం ఒక్కసారి Warden వసంతమీద కక్కేసాడు. అంతటితో ఆగ కుండ, వసంత ని ఎగా దిగా చూసి మళ్లి “ఆహాహాహ!” అని గట్టిగ నవ్వడం మొదలు పెట్టాడు.

వసంత కి వొళ్ళు మండి, Kitchen లోకి వెళ్లి వేడి వేడి అట్ల కాడ తెచ్చి, భట్ట్ చేతి మీద వాత పెట్టింది. “ఫట్ట్” మని భట్ట్ ఒక్కసారి నవ్వు క్షణం ఆపాడు బాధతో. మళ్ళ ఏదో గుర్తొచ్చి, చేతి వాతను చూసుకుంటూ కాంటీన్ నుండి బయటకి వచ్చాడు మళ్ళ”ఆహాహాహ!” అని నవ్వుకుంటూ. ఇంతలో పక్కింటావిడ వచ్చి “అరె ! భట్ట్ భాయ్!చేతికి ఏమైంది” అని, “భట్ట్ భాయ్! ఈ రోజు నాకు చాల bad day అంది.భట్ట్ మళ్ళ గట్టిగ ఆహాహా అని నవ్వుతూ, “ఎందుకు madam !?” అన్నాడు. పక్కింటావిడ భట్ట్ అర్ధంలేని నవ్వు ని అనుమానంగా చూస్తూ, “పోయిన ఏడు, ఇదే రోజు మా ఆయన, Car accident లో చనిపోయారు భట్ట్ ! అంది విచారంగా మొహం పెట్టి. “ఆహాహాహ ! అంతే కదా, ఇంకా ఏమిటో నని హడలి చచ్చాను….ఈ విషయం ఇంత serious గా కాకపోతే కొంచం నవ్వుతూ చెప్పొచ్చు కదా..madam ! అంటూ పగలబడి నవ్వడం మొదలు పెట్టాడు. పక్కింటావిడ భట్ట్ అన్న మాటలకు అగ్ని గోళ్ళం లాగ మండి పడుతూ, భట్ట్ Collar పట్టి దగ్గెరకు లాగి, చెంపలు ఫట్ట్! ఫట్ట్! మనిపించింది, పాపం అసలు విషయం ఏమిటో తెలియక.

వణుకుతున్న చేతులతో భట్ట్, మరునాడు మళ్ళీ దిన పత్రిక పేజీలు తిప్పుతున్నాడు, ఈ రోజు నా ముదనష్టపు జాతకం ఎలాగుందో అనుకుంటూ. కళ్ళు “నీ రేపు” మీద అప్రయత్నంగా పడ్డాయీ. “కనులు కనులు కలిసి, కాళ్ళు చేతులు కలసి – అడుగులు కలిసి చాల దూరం నడుస్తావు – అనుకోని ఆకస్మిక బంధాలు ఏర్పడగలవు” అని వుంది “నీ రేపులో”, భట్ట్ ఈ మాటలు చదివి, ఉబ్బి తబ్బిబై, ఆహా! ఇన్నాళ్ళకు నా జాతకం బంగారు పంటగ పండింది. ఏదో అనిర్వచ ఆనందంతో భట్ట్ కళ్ళు మణి పూసలై మెరిసాయి.ఇన్నాళ్ళకు బ్రహ్మచారి బ్రతువుకు స్వస్తి, ఒక అందమైన అమ్మాయి తటస్థ పడి, తీపి రుచులు రుచి చూపించ నుందని చాల ఉప్పొంగిపోయాడు.

ఈల వేస్తూ మళ్ళీ Hostel Canteen కి నడిచాడు. కాంటీన్ లో orders తీసుకునే అమ్మాయి, భట్ట్ ని వింతగా చూసి! పత్రికలో “నీ రేపు” ప్రభావంగా తలచి , చిరుమంద హాసం చేసింది తియ్యగా.భట్ట్ ఆమె విరబూసిన చిలిపి నవ్వుల పుష్పాలకు ముగ్ధుడై, ఏవేవో ఊహలలో విహరించాడు. ఆమెతో ఇంకా ఎక్కువ సమయం గడపాలను కున్నాడు “నీ రేపు”గుర్తుకు వచ్చి. కళ్ళలో ఏవేవో కొంటి భావాలను చేర్చి, నోటితో order ఇవ్వకుండా… “ఈహోఒ” అన్నాడు, “ఇడ్లి” అర్ధం స్పురించేలాగా, అందమైనCanteen సుందరి, “ఏమిటి!?” అన్నట్టు మొఖం పెట్టింది, పెదవి విరుస్తూ. ఈసారి భట్ట్ “పెసూం…పెసూం…వూం వూం” అన్నాడు కళ్ళతో ఏదో సైగ చేస్తూ…పెసరెట్టు అర్ధం స్ఫురించేలాగా…! ఈ సారి కూడా అందమైన సుందరి కి అర్ధం కాక (ఇందుకే వొక కవి అన్నాడు…”అందం వుంది కాని అసలిది లేదు” అని అంటే బుర్ర లేదని!) ఆశ్చర్యంతో భట్ట్ ని తెర పార చూసి! ఇక ఇలా కాదని….Menu కార్డు ఇచ్చింది…భట్ట్ అది పుచ్చుకునేటప్పుడు…ఎంతో సొగసుగా అందుకున్నాడు, ఆమె అందమైన వెళ్ళాను సున్నితంగా తాకి, ఇంచు మించు ఆమె “మేను కార్డు” తీసుకుంటున్నట్లు ఫీల్ అయిపోతూ.. అటూ …ఇటూ చూస్తూ ఏదో ఆలోచిస్తున్నట్టు నటించి కావాలని order ఇవ్వడం ఆలస్యం చేస్తున్నాడు భట్ట్…..అమ్మాయీ చాల ఇబ్బందిగ మొహం పెట్టింది…

ఇంతలో వెనుక Queue లో వున్నవాళ్ళు, ఆకలితో మండి పడుతూ.. “వీడి! పిండం పిల్లులెత్తకెళ్ళ!ఎంత సేపు వీడి దిక్కుమాలి order ! తెగ వంకర్లు పోతున్నాడు… అనుకుని, “తప్పుకోవయ్య భట్ట్! మాకు office కి time అవుతోంది, మమ్మల్ని టిఫిన్ తిని వెళ్ళని…అంటూ కోపంతో వెనుకనుండి, భట్ట్ shirt పట్టుకుని గుంచి, వొక మూల కి తోశారు.

అందమైన Canteen అమ్మాయీ ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ, మిగతా వారి orders తీసుకుని, భట్ట్ వైపు మురిపంతో నవ్వుతూ చూసింది…అంతే భట్ట్ మళ్ళ Balloon లాగ ఉబ్బి పోయి “ఫట్ట్ ” అయ్యాడు. అమ్మాయీ భట్ట్ కళ్ళల్లో కళ్ళు పెట్టి “ఏమిటి కావాలి” అన్నట్టు అడిగింది వచ్చే నవ్వును ఆపు కుంటూ.. భట్ట్ పూర్తిగా ఐసైపోయి…ఆమె అందమైన కళ్ళవంకే చూస్తూ….”నీ ఇష్టం, నీ కిష్టమైన tiffin పెట్టు” అన్నాడు ఎంతో మృదువుగా…ప్రేమగా.. ఆ అమ్మాయీ వచ్చే నవ్వును అతి కష్తం మీద ఆపుకుని తెచ్చింది…రెండు ప్లేట్లు.

భట్ట్ ఆ ప్లేట్లను చూసి, ఒక్కసారి భయంకరంగా shock అయ్యాడు. తిని పారేసిన ఇడ్లి ముక్కలు, మాడిపోయిన దోస ముక్కలు వున్నాయీ….వొక్కసారి ఉక్క్రోషంతో , ఆమె కళ్ళ వంక చూద్డా మనుకుని తల ఎత్తి…అవమానంతో మళ్ళ తల తిప్పి… విస..విసా canteen నుండి బయటికి వచ్చాడు అతి వేగంగా…కోపంగా.. జరిగిన ప్రేమావమానం తలచుకుని, తన జాతక ఫలాన్ని నిందించుకుంటూ Bus ఎక్కాడు ఇక office కి వెళ్దామని.

నల్ల కళ్ళద్దాలు పెట్టు కున్న వొక సుందరి, తన seat ఎదురుగా కూర్చుని వుంది. ఆ అమ్మాయీ కళ్ళు చూడలేక పోయిన, ఎదురగా వున్న తననే చూస్తోందని ఊహించి, లేని నవ్వు తెచ్చుకుని చిరునవ్వు నవ్వాడు. ఆ అమ్మాయీ పరధ్యానంగా ఏదో నవ్వుకుంటోంది.. భట్ట్ ఆమె తనను చూసే నవ్వుతోందని, బహుసా సిగ్గు కాబోలు అని అనుకుని…తన కాళ్ళతో, సన్నగా ఆమె కాళ్ళను తాకాడు ఎవరికి కనిపించనట్లు. ఆ అమ్మాయీ ఇంకా మౌనంగా నవ్వుకుంటోంది..భట్ట్ అనుకున్నాడు, “అరె! ఇదే మరి ప్రేమకు చిహ్నం..అమ్మాయీ ప్రతిఘటించలేదు..కోపగించలేదు…ఇక రెచ్చిపో” అనుకుని.. “చేతిలో…చెయ్యేసి…చెప్పు బావ” అనే పాట స్ఫురణ కి వచ్చి, Sangam theatre 70mm కి వెళ్లి పోయి… కరెంటు కట్ అయి చవట వాసనలు గుర్తొచ్చి..ఖంగు తిని మళ్లి bus లోకి వచ్చాడు… ఇంతలో ఆ అమ్మాయీ “excuse me ” అంది భట్ట్ ని ఉద్దేశిస్తూ..భట్ట్ ఆనందానికి అవధులు లేవు…లేని వినయాన్ని కూడా దీసుకుని, ఎంతో అమాయకుడిలాగా “Yes ! Please! అన్నాడు ….మంచు పర్వతం లా కరిగిపోతూ.. అప్పుడు అమ్మాయీ”మీరు, ఏమి అనుకోక పోతే!….?” వెంటనే భట్ట్, ఏమి అనుకోను “చెప్పండి, కొండలను నుగ్గి చెయ్యమంటార, నిప్పులో దూక మంటార, Antarctica లో బట్టలు లేకుండా నెల రోజులు ఉండమంటార!?” అన్నాడు ఆవేశా పడిపోతూ..అప్పుడు ఆ అమ్మాయీ…”చ! చ ! అవేమి వొద్దు….నేను మీకు ఎందుకంత శ్రమ కలిగిస్తాను…మీరు ఏమి అనుకోక పోతే మీ చేయి ఆసరాగా అందించి నన్ను bus కొంచం దింపుతార!?” అన్నది. భట్ట్ ఆనందం ఇక హిమాలయాలకి సరి తోడు…”Yes ! Of course with Pleasure ” అన్నాడు ఎంతో పరవశంతో, ప్రపంచంలో తానొక్కడే Gentleman అయితే ఎంత బాగుండూ అనుకుంటూ..ఒక కంట తోటి మగ ప్రయాణీకులను తేలిగ్గా చూసాడు…చూడండి రా చవట వెధవల్లారా అన్నట్లు..! ఇంతలో ఆ అమ్మాయి స్టాప్ రావడంతో, భట్ట్ చేయి ఆసరాగా తీసుకుని bus దిగింది మెల్లగా.. ఆమె మృదువైన చేతి స్పర్శకు తన్మయుడయిపోయీ….”I Love You!” అంటుందేమో అనుకున్నాడు పాపం భట్ట్. ఆ అందమైన అమ్మాయీ నల్ల కళ్ళద్దాలు సరిచేసుకుంటూ, “ఈ రోజుల్లో, వికలాంగులకు, అంద్ధులకు, సానుభూతి, సహకారం బొత్తిగ కరువైపోయిన్దన్నయ్య!? అంది…”అన్నయ్య!? …… అంతే భట్ట్ కి భూకంపం వచ్చి, తన కిందున్న భూమిని లాగేసుకున్దేమోనని అనుకున్నాడు, ఈ మధ్యనే కొన్న తన కొత్త shoes ని చూసుకుని, హమ్మయ్య!! ఇంకా బ్రతికే వున్నకదా అనుకున్నాడు.

ఇంతలో మళ్ళ అమ్మాయీ అంది. “పుట్టు గుడ్డైన నాకు, దైవం లాగ సహాయం చేసారు మీరు, మీకు శ్రమ అనుకోక పోతీ, పక్క వీధి “బొంకుల దిబ్బ” లో మా ఇంటి దగ్గర దింపరూ అంది ఎంతో మురిపెంగా… భట్ట్ అనుకున్నాడు…”బొంకుల దిబ్బ దగ్గర కాదు చెల్లి, నిన్ను బొందల దిబ్బకు కూడా చేరుస్తా” అని…పైకి మాత్రం మర్యాద కోసం “తప్పకుండా” అన్నాడు…కళ్ళలో కోపం …కన్నీళ్ళుగా కారుతోంది.. గుడ్డి అమ్మాయీ…నడుస్తూ…”మీ..పేరేమిటి!? అంది, భట్ట్ మనసులో కోపం తో..”ఈ వివరాలన్నీ ఎందుకో!? అనుకున్నాడు” కాని పైకి”ఆ ! నన్ను మూర్ఖ భట్ట్, అంటారులే!?” అన్నాడు, బయటకి కోపం కనిపించనీయ కుండా… అంతలో అమ్మాయీ…”అరె! మీ పేరు తమాషాగ వుందే!?” అంది. “ఔను, నా బ్రతుకే ఒక తమాషాగా తయ్యారైంది” అనుకున్నాడు భట్ట్.

ఇంతలో అందమైన గుడ్డి అమ్మాయి ఇల్లు వచ్చింది, భట్ట్ ఆమెని దిగ బెట్టి విసురగా తిరిగి పోతూండగా, “మళ్లి, ఎప్పుడు వస్తారు? అంది గుడ్డమ్మయీ.. “ఎందుకు!?…ఇప్పటికి ఇది చాలు లే…అయిన పరవశం…ప్రేమ అభిమానాలు చాలు…ఆనందం తో…పరవశం తో నా ఒళ్ళు వేడెక్కి పోయి తబ్బిబై పోతున్నాను” ..అనుకుని పళ్ళు పట..పట నూరాడు భట్ట్.

ఆఫీసుకి అప్పుడే బాగా ఆలస్యం అయిపోయిందని గ్రహించి, ఆఫీసు manager “కనక దుర్గ” గుర్తుక్కు వచ్చి, గబా గబా బస్సు స్టాండ్ కి పరుగు-నడక సాగించాడు భట్ట్, హట్టాత్తు గ పక్క park నుండి 4 / 5 ఏళ్ళ పిల్లవాడు…”నాన్న !…నాన్న ! అంటూ ఏడుస్తూ భట్ట్ వెంట పట్టాడు.”కుర్రవాడు పరుగు పరుగున వచ్చి, “నాన్న, ఎక్కడికి వెళ్తున్నావు అమ్మను, నన్ను వదలి” అన్నాడు మురిపెంగా భట్ట్ ప్యాంటు పట్టి కిందకి లాగుతూ, “ఉండు…నీ సంగతి అమ్మకి చెపుతాను…” అన్నాడు, ముక్కున కారుతున్న చీముడిని , భట్ట్ ప్యాంటు కి పూస్తూ… భట్ట్ ఒక్కసారి తన ప్యాంటు ని పైకి లాక్కుని, కుర్రాడి వంక చూసాడు….భట్ట్ ప్రాణాలు పైనే తూండగా….”ఎవడవురా నువ్వు కుంక”!? నీకు నేను నాన్ననా!?? కాఫీ లో కారం వేసుకుని తాగే నీ మొహం మండ!?? నాలుగు వేడిగ తగిలిస్తా!?? అన్నాడు చేతులు పైకి లేపి!?

అంతే ….ఆ కుర్రోడు”బారు మంటూ రాగం అందుకున్నాడు… ఘంటసాల ని మరిపిస్తూ… ఏడుపు మధ్యలో…నాన్న! నేను నీకు ఏమి కాన!? ఒకసారి, నన్ను చూడు”, అంటూ వచ్చీ, రాని, మాటలతో ఒకటే బోరు బోరున ఏడుస్తున్నాడు! భట్ట్ ఏమి పట్టించు కోకుండా వెళ్ళడం చూసి, దారిన పోయే వాళ్ళు, ఏమండీ! ఇదేమి అన్యాయం? పసి పిల్లవాడిని రోడ్డున వదిలేయడమే కాక, ఏమి పట్టించుకోకుండా వెళ్ళు తున్నారు..! నువ్వు మనిషివ…? రాక్షసుడివ….?అంటూ చీవాట్లు పెడుతూ , పసివాడిని ఎంత వద్దంటున్న వినకుండా, చీమిడి కారుతున్న ముక్కుతో, ఇస్త్రీ చేసి తెల్లని చొక్కా వేసుకున్న నా చంకగా ఎక్కించి… చక్కా పోయారు…చచ్చి నోళ్ళు..

ఇదేమి ముదనష్టపు జాతకంరా దేవుడా అనుకుంటూ.. పిల్లవాడ్నిసముదాయిస్తూ….వదిలున్చుకునే ప్రయత్నంలో “బాబు… నీ అమ్మ! ఏది” అన్నాడు భట్ట్, బండ బూతును సంభోదనలో కలిపి. ఆ చంటి పాపడు, వచ్చే ఎడ్పుని ఆపుకుంటూ…”నాన్న! అదిగో అమ్మ, పార్క్ లో చెట్టు కింద. పల్లీలు తోలు తీసుకుని తింటోంది!!? అన్నాడు వచ్చీ, రాని భాషలో…(భట్ట్ అనుకున్నాడు మనసులో, పద నీ అమ్మ దగ్గరకి, తోలు నేను తీసి పెడతానని).భట్ట్ ని, పిల్ల వాడిని చూసి, పల్లీలు తినటం ఆపి, “ఎవరు!మీరు!” అంది, ప్రాయంలో వున్న వొక మెలికలు తిరిగిన సుందరి. భట్ట్ కోపం తో ఊగిపోతూ, “ఆఆ ! నేనేవరినా!? అడ్డ మైన ప్రతి వెధవని నాన్న!అని నీ కొడుకు రాగాలు తీసి పిలుస్తూంటే నీకు వినపడలేదా సుందరి!? అన్నాడు.. ముఖమంతా కోపం తో ఎర్రగా అయిపోయి. అవతలి అమ్మాయీ, గట్టిగ వచ్చే నవ్వును పైపంటితో ఆపుకుని, “అయ్యో!అపార్ధం, చేసుకోకండి!White Shirt వేసుకుని ఆఫీసు కి వెళ్ళే వాళ్ళను “నాన్న!?” అంటూ ముద్దుగా పిలుస్తాడు ఏమి తెలియని నా చిట్టి తండ్రి, అంది….కుర్రాడిని భట్ట్ నుండి తీసుకుని మురిపెంగా ముద్దు పెడ్తూ….అప్పుడు భట్ట్ కి ఒళ్ళు మండి అన్నాడు..”అయ్యో! పాపం! అలాగా…ప్రతిరోజు పొద్దున్న 8:30కి బస్సు స్టాండ్ కి పంపు నీ కొడుకుని .. తుంబల..తుంబల..నాన్నలు విరివిగా దొరుకుతారు…నీ గారాబు తండ్రికి…. వాళ్ళలో వాడికి ఇష్తమైన నాన్నను ఏరుకోవచ్చు, అని కసితో, కోపంతో వీసా వీసా నడిచి…బస్సు ఎక్కి ఆలస్యంగా ఆఫీసు చీరాడు….

ఎప్పుడూ…కోపంతో మండి పడే office manager , కొంటె గ చూసి, అర్ధవంతంగా నవ్వింది….ఒక్కసారి భట్ట్ కి తాను నిలుచున్నా భూమి కూలిపోతున్దేమోనని భయంవేసింది, మనసులో అనుకున్నాడు….కొంప తీసి ఈమె నన్ను… ……..!? “”అమ్మ! బాబో! యని పెద్దక కేక పెట్టి Office లోనే మూర్చ బోయాడు పాపం భట్ట్

Scroll to Top