పార్ట్ టైం ప్రహసనం

పార్ట్ టైం కోసం పరుగులు పెడుతున్న రోజులు. ఒక రెస్టారెంట్ లో దూరి జాబు కావాలి అని అడిగితే , బయో డేటా వుందా అని అడిగాడు. అంట్లు తోమే జాబుకి కూడా బయో డేటా కావాలా అని నోరు తెరిచి ఆశ్చర్యపోయి, తెరచిన
నోరు ముయ్యకుండా యూనివర్సిటీకి వెళ్లి పది సెంట్ల ప్రింట్ అవుట్లు పది తీసి ఒకటి వాడికిస్తే, ఎక్స్పీరియన్స్లేదని రిజెక్ట్ చేసాడు. అప్పటివరకు ఇంట్లో వాళ్ళ మీద అదారపడ్డ నాకు అ క్షణం మొదలైంది జీవితం.

కనపడిన ప్రతి షాప్ లోకి దూరి వినతి పత్రాలు పంచినట్లు పంచాను బయోడేటా. నేను షాప్ లో నుంచి రెండు
అడుగులు బయటకు వెయ్యగానే చెత్త బుట్టలో పడేసే వాళ్ళు . కొన్ని రోజులకు అర్ధంయ్యింది ఇలాంటి పనులకు వాళ్ళకు కావలిసింది రుస్తుం లాంటి మనషులు అని . మన శరీరాలు సిస్టం ముందు కుర్చుని టికు టికు మని కొట్టడానికి తప్ప వొళ్ళు వంచి పని చెయ్యటానికి పనికి రావు . తరవాత రోజు నుంచి నలుగు టి -షర్ట్లు పైన షర్టు వేసి రొమ్ము విరుచుకుని న రెస్యుమె ఇచ్చవాడిని .కొంత మంది నవ్వుకొనే వాళ్ళు , కొంత మంది నా అవస్థ చూసి అయ్యో పాపం అనుకొనే వాళ్ళు.

నెల రోజులు తిరగిన తరువాత రికమండేషన్ ద్వార ఒక దేశి రెస్టారెంట్లో డిష్ వాషేర్ జాబు వచ్చింది. నీట్ గా జీన్స్ టి షర్టు వేసుకుని వెళ్లి వాడి కర్కు తి మండ మద్యానం లంచ్ కి డిష్ వాషేర్ ని పెట్టుకోకుండా అవన్నీ గుట్ట పేర్చి ఉంచాడు. మన దేశి తెలివేతటలు అన్ని ఇన్ని కాదు. అవి క్లియర్ చెయ్యడానికి రెండు గంటలు పట్టింది.

మద్యలో ఒక వెయిటర్ వచ్చి ఈ స్పూన్ సరిగా కడగలేదు చూడు అన్నాడు . కడుగుతున్నదాన్ని పక్కన పెట్టి “వోరాయ్ చంచ నువ్వు తెచ్చింది స్పూన్ కాబట్టి సరిపోయింది ఎ ఫోర్కో లేక నైఫో అయితే నీకు దిగి వుండేది ” అని మనసులో అనుకోని వక వెర్రి నవ్వు నవ్వి మల్లి కడిగిచ్చా . ఐదు గెంటల సేపు ఆగకుండ అంట్లు తోమి అలిసిపోయి ఓనర్ వంక చూసి “దరిద్రుడు ధం బిర్యానీ కోసం ధాబా కెళితే దాల్ మఖాని తప్ప ఏమి దొరకలేదనట్లు ” . రైస్, పప్పు పాకెట్లు చేతిలో పెట్టాడు. వాడిచ్చిన డిన్నర్ ప్యాక్ తో రెండు బస్సులు మారి ఇంటికి వచ్చేసరికి అర్దరాత్రి అయ్యింది

తిని మంచం ఎక్కగానే గుర్తోచింది “థీసెస్ ” సబ్మిట్ చయ్యడానికి రేపు లాస్ట్ డే అని. ఇంటి నుంచి తెచ్చి న రగ్గు కప్పుకొని 24/7 ల్యాబ్ కి వక దండం అనుకోని యూనివర్సిటీకి బయలుదేరా. దారిలో కంగారులు నా వింత అవతారం చూసి కంగారు పడినట్టున్నాయ్. మామూలుగా అవి బిత్తర చూపులు చూస్తూ వుంటై, ఈ సారీ మాత్రం నన్ను చూసి ఏదో వింత జంతువును చుసినట్టు పరార్. బులెట్ కి కూడా అంధ నంత స్పీడ్ లో పరుగెత్తయ్.

యూనివర్సిటీకి వెళ్ళగానే సెక్యూరిటీ గార్డ్ పరిగెత్తుకుంటూ వచ్చి ఐడి ప్లీజ్ అన్నాడు . ఇవ్వగానే దాని వంక నా వంక చూసి , “ఐ లైక్ యువర్ బెడ్ షీట్ ” అన్నాడు . ఇది బెడ్ షీట్ కాదురా బెవకుఫ్ , “నో బెడ్ షీట్ – థిస్ ఇస్ రగ్, కంబలి ” అన్నను . “వాట్ కంబలి , కంబలి…. “ అంటుండు – “ డోంట్ వర్రీ ఐ విల్ బ్రింగ్ యు బిర్యానీ టుమారో” అన్నాను . బ్రెడ్ తిని తిని నాలుక చచ్చి పోయిన ట్టుంది బీమసేనుడికి , బిర్యానీ అనగానే వాడి కళ్ళలో ఒక వెలుగు . “ఓహ్ , ఐ లవ్ ఇండియన్స్ , గెట్ ఇన్ సర్ ”అన్నాడు . ఒక సారీ బిర్యాని తిని చూడు నువ్వు కూడా భారతీయుడివి ఆయిపోతావ్ అనుకుని ల్యాబ్ లోకి పరిగెత్తా .

తెల్లవారు జాము వరకు కునికిపాట్లు పడుతూ అది పూర్తి చేసి ఇంటికి రాగానే ఫ్రెండ్ డోర్ తీసి ఒక నవ్వు నవ్వి ఈరోజు ఇంట్లో షిఫ్ట్ నీదేరా అన్నాడు. పళ్ళు పరపరకొరికి , ఎక్కువ కోరికేతే డెంటిస్ట్ కాస్ట్లీ అని ఆపేస. ఏదో సినిమాలో బ్రహ్మానందం చెప్పినట్టు, “వేసింది రిచ్ గెట్ అప్ అమెరికా లెవెల్ బిల్డ్ అప్ తీరా చుస్తే లోపల వంట సెటప్ – నీ ఎంకమ్మ ” అనుకోని కిచెన్ లోకి వెళ్లి చుస్తే, తుఫాను వచ్చిన తరువత వస్తువులన్నీ చల్లా చదురయినట్లు ఉన్నై సామాగ్రి . వంట కాగానే ఏదో వరద బాదితులు తిన్నట్టు తిన్నారు . మల్లి రుద్దుడు షురు. అవి పూర్తి చేసి సాయంత్రం కడాగాల్సిన గిన్నల గురించి తలుచుకొంటూ యూనివర్సిటీ క్లాసుకి బయలుదేరా!

— కృష్ణ శ్రీ

Scroll to Top