ఏఎన్నార్ జాతీయ అవార్డు – మెగాస్టార్


ఏఎన్నార్ జాతీయ అవార్డును అందుకున్న మెగాస్టార్ చిరంజీవి

డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు జాతీయ అవార్డును మెగాస్టార్ చిరంజీవి అందుకున్నారు. ఇండియన్ సూపర్ స్టార్, బిగ్ బి అమితాబ్ బచ్చన్ చేతులు మీదుగా అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన కార్యక్రమంలో స్వీకరించారు. అమితాబ్‌ బచ్చన్‌కు ఎదురెళ్లి చిరంజీవి పాదాలకు నమస్కరించగా.. ఆయన అంతే ప్రేమగా దగ్గరకు తీసుకొని గౌరవం చూపించారు. ఏఎన్నార్‌ అవార్డును అమితాబ్‌ బచ్చన్‌ చేతుల మీదుగా అందుకున్నాక చిరంజీవి మాట్లాడుతూ అమితాబ్‌తో తన పరిచయం, అనుబంధం గురించి చెప్పుకొచ్చారు. అంతకుముందు నాగార్జున , అమితాబ్‌ మాట్లాడుతూ చిరంజీవి గురించి, ఏఎన్నార్‌ గురించి గొప్పగా చెప్పారు.

అమితాబ్ చేతులమీదుగా ఈ అవార్డును అందుకోవడం తనకు జీవితంలో మరిచిపోలేని అనుభవమని చిరంజీవి అన్నారు. ఏఎన్నార్‌ అభిమానుల్లో సీనియర్‌ మోస్ట్‌ ఫ్యాన్‌ మా అమ్మే. ఆమె కడుపులో నేను ఉన్నప్పుడు నాన్నను బతిమలాడి నాగేశ్వరరావు సినిమా ‘రోజులు మారాయి’కి వెళ్లింది. మధ్యలో చిన్నపాటి సమస్య వచ్చి జట్కా బండి తిరగబడినా ఆమె వెరవలేదు. సినిమా చూడాల్సింది అని పట్టుబట్టి చూసింది అని నాటి రోజుల్ని చెప్పారు చిరు. నాగేశ్వరరావు అంటే అమ్మకున్న అభిమానం.. రక్తం ద్వారా నాకు వచ్చిందేమో. ఆయన డ్యాన్స్‌లంటే నాకు ఇష్టం. ఆయన సినిమాల్లో పాటలకు ఇంట్లో డ్యాన్స్‌లు వేసేవాణ్ని. ఓసారి అక్కినేని నా గురించి మాట్లాడుతూ ‘నాకు ఎముకలు ఉన్నాయి, కానీ చిరంజీవికి ఎముకలు లేవు’ అని అన్నారు. అంతగా నన్ను అభిమానించారు అని చిరంజీవి తెలిపారు.

ఇటీవలే చిరుకు పద్మవిభూషణ్ వచ్చిన సంగతి తెలిసిందే. తర్వాత ఐఫా వేదికపై ప్రత్యేకమైన గౌరవం దక్కింది. ఈ రెండు ఇలా ఉండగానే అక్కినేని నాగేశ్వరరావు జాతీయ అవార్డు వరించింది. హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోలో.. అతిరథ మహారథుల సమక్షంలో.. ఏఎన్ఆర్ నేషనల్ అవార్డ్ ఫంక్షన్ 2024 చాలా అట్టహాసంగా జరిగింది.

ఈ సంవత్సరం ఈ ఏఎన్ఆర్ అవార్డ్స్ లో.. జాతీయ అవార్డును మెగాస్టార్ చిరంజీవి కి ఇస్తున్నట్లు.. కొద్ది రోజుల క్రితమే నాగార్జున ప్రకటించిన సంగతి తెలిసిందే. గతంలోనే హీరో నాగార్జున ప్రకటించారు. ఇప్పుడు ఆ పురస్కార ప్రధానోత్సవం .. అతిరథ మహారధుల మధ్య ఘనంగా జరిగింది.

ఏఎన్ఆర్ నేషనల్ అవార్డు ఫంక్షన్ లో మరోసారి ఈ విషయాన్ని గుర్తు చేశారు మెగాస్టార్ చిరంజీవి. మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ… “నేను డాన్సులు వేయడానికి ఆద్యున్ని. ఈ ఫిలిమ్ ఇండస్ట్రీలో డాన్సుల్ని పరిచయం చేసింది నేనే. నేనే ఆడుతుండేవాడిని. కానీ ఆ డాన్సులకి స్పీడ్ పెంచింది గ్రేస్ పెంచింది మెగాస్టార్ చిరంజీవి అని ఏఎన్నార్ అనేవారు. చిరంజీవి హీరోయిన్ తో డాన్స్ వేస్తుంటే నేను చిరంజీవినే చూస్తాను. ఆ హీరోయిన్ ని చూడను. అలా ఆకట్టుకుంటాడు తన డాన్సులతో. అని ఆయన అంటుంటే ఆ మాటలను నేను వింటుంటే, నాకు అవి చాలదా అనిపించేది ఆ మాటలే నాకు ఎన్నో అవార్డులతో సమానం అంటూ మెగాస్టార్ చిరంజీవి చెప్పుకొచ్చారు.”

కాగా ఈ అవార్డుల ఫంక్షన్లో.. నాగేశ్వరరావు ఐసీయూ లో ఉన్నప్పుడు తాను చివరగా ఫ్యామిలీ గ్రూప్ లో పంపించిన ఆడియో మెసేజ్ వినిపించి అందరిని బాబోద్వేగానికి గురి చేశారు. అందులో ఏఎన్ఆర్ మాట్లాడుతూ.. “నాకోసం మీరంతా ఆ దేవుడిని ప్రార్థిస్తున్నారన్న విషయం.. తెలుసు. నా కుటుంబ సభ్యులు కూడా ఎప్పటికప్పుడు నా ఆరోగ్య సమాచారం గురించి మీకు తెలియజేస్తూనే ఉన్నారు. మీ అభిమానానికి, ప్రేమకి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు చెబుతున్నాను. త్వరలోనే నేను మీ ముందుకు మళ్లీ వస్తానన్న నమ్మకం నాలో ఉంది. మీరు చూపించిన ప్రేమాభిమానాలకు ఎప్పటికీ నేను రుణపడి ఉంటాను. ఇక సెలవు తీసుకుంటున్నా..” అంటూ చివరిసారిగా ఐసీయు నుంచి నాగేశ్వరరావు చెప్పిన మాటలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి.

Scroll to Top