FTAA నూతన కార్యవర్గం (2024 – 2026)

గత నెలలో జరిగిన FTAA (Federation of Telugu Associations) సర్వసభ్య సమావేశంలో నూతన కార్యవర్గం ఎన్నుకోబడింది.  FTAA నూతన అధ్యక్షులుగా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ కృష్ణ నడింపల్లి (OAM) గారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.  ఈ సందర్భంగా శ్రీ కృష్ణ గారు మాట్లాడుతూ FTAA సంస్థాపరంగా సాధించిన విజయాలను వివరించారు.  ఇందులో ముఖ్యంగా తెలుగు భాష సామాజిక భాషగా గుర్తింపు మరియు వివిధ నగరాలలోని ఎన్నో తెలుగు సంస్థలను ఒకే త్రాటిపై తీసుకొచ్చి తెలుగు భాషా సంస్కృతులను పరిరక్షించడంలో కీలక పాత్ర వహించిందని చెప్పారు.

స్థానిక బడులలో తెలుగు బోధన
గత రెండు సంవత్సరాలలో FTAA సబ్ కమిటీ ద్వారా తెలుగు భాష నేర్చుకునే పిల్లలు మరియు ఔత్సాహిక ఉపాధ్యాయుల వివరాలు సేకరించడం జరిగిందనీ,  వీటి ద్వారా స్థానిక బడులలో తెలుగు బోధనా భాషగా ప్రవేశ పెట్టడానికి తగు సన్నాహాలు రూపొందిస్తున్నట్లు గత రెండేళ్లు అధ్యక్షులుగా ఉన్న శ్రీ సత్య శీలం గారు తెలిపారు.  క్రొత్త కార్యవర్గం ఈ ప్రక్రియ కొనసాగించి ఉత్తమ ఫలితాలు సాధించగలదన్న ఆశాభావం వ్యక్తం చేసారు.

3 క్రొత్త సంస్థలు
FTAA సంస్థను బలోపేతం చేసే దిశగా ఈ సంవత్సరం 3 క్రొత్త సంస్థలు సభ్యులుగా చేరడం మరింత ఆశాజనకంగా ఉంది.

  1. తాస్మానియా తెలుగు సంఘం
  2. నార్తర్న్ టెరిటరీ తెలుగు సంఘం
  3. తెలుగు సంస్కృతి బ్రిస్బేన్

పైనుదహరించిన సంస్థలతో FTAA  సభ్యుల సంఖ్య 15 కి చేరుకుంది.

2024 – 2026 ద్వైవార్షిక ప్రణాళిక
తెలుగు వారి ఉనికిని విస్తరించి మరింత బలోపేతం చేయడం ఎంతైనా అవసరమని నూతన అధ్యక్షులు శ్రీ కృష్ణ గారు చెప్పారు.  దీనికి ప్రపంచ సాహితీ సభలు, తెలుగు సంస్కృతిని తెలియజేసే పద్య నాటకాలు, జానపదాలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతీ నగరంలో నిర్వహించి స్థానిక సంస్థలతో మమేకమవ్వడం ఎంతైనా అవసరమని నొక్కి వక్కాణించారు.  వచ్చే రెండేళ్లలో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడానికి సభ్యులందరూ చేయూతనివ్వాలని  పిలుపునిచ్చారు.

నూతన కార్యవర్గం:

  1. అధ్యక్షులు: కృష్ణ నడింపల్లి (TAC, Canberra)
  2. ఉపాధ్యక్షులు 1: మల్లికేశ్వర రావు కొంచాడ (Telugumalli)
  3. ఉపాధ్యక్షులు 2: వసంత కహలూరి (TAAI, Melbourne)
  4. కార్యదర్శి: సత్యనారాయణ శీలం (TASA, Adelaide)
  5. సహాయ కార్యదర్శి: ప్రసూన కంభం మెట్టు (STA, Sydney)
  6. కార్యదర్శి (Community Coordination): అమిత్ దాసరి
  7. కోశాధికారి: హరి పంచుమర్తి (QTA, Brisbane)
  8. ప్రజా పాలనాధికారి (పబ్లిక్ ఆఫీసర్): లక్ష్మి నరసింహారావు కొలను (TAC, Canberra)
Scroll to Top