1
మిత్రుడికోసం ప్రాణం ఇవ్వడం సులభం
ప్రాణం ఇచ్చే స్థాయికి మిత్రుడు దొరకడం కఠినం
————————-
2
మంచి స్నేహం నమ్మకం ఆధారంగా ఏర్పడుతుంది
ఇద్దరు గొడవపడ్డా ఒకరు గొడవపడ్డా నష్టం స్నేహానికే
—————————
3
దేవుడిచ్చిన వరం మిత్రుడు
వరమై వచ్చిన దేవత అమ్మ
——————————
4
విద్యుత్తు లేని రాత్రి కొవ్వొత్తి ఏడ్చినట్టు
ప్రతి రాత్రి నీకోసం కన్నీళ్లు కారుస్తున్నాను
—————————
5
వెతికి దొరికినా వెతక్కుండా దొరికినా
నీలాంటి బంధాన్ని కోల్పోను మరచిపోను
———————
6
విడిపోవడాన్ని ఎదుర్కొన్నప్పుడే
కొన్ని బంధాల గురించి ఆలోచించడం సాధ్యమవుతోంది
—————————-
7
విడిపోవాలని తపించే మనసుకి విడిపోవడంలోని బాధ తెలియడం లేదు
విడిపోవడం వల్ల కలిగే బాధ కన్నా జ్ఞాపకం బాధ భరించలేనిది
—————————–
– చౌటపల్లి నీరజ, కైకలూరు