భాగవతం కథలు – 24

కర్దమ ప్రజాపతి సంతతి

సూతుడు శ్రీశుక యోగి పరీక్షిత్తుడికి చెప్పిన విషయాలను ఇలా వినిపించాడు….

స్వాయంభువ మనువు తన కుమార్తెలలో ఒకరైన ఆకూతిని రుచి ప్రజాపతికి, ఇంకొక కుమార్తె ప్రసూతిని దక్షప్రజాపతికి ఇచ్చి పెళ్లి చేస్తారు. ప్రియవ్రతుడు, ఉత్తావపాడుదు అతని కుమారులు. వీరి వల్ల కలిగిన సంతాన పరంపర ముల్లోకాలలోనూ ప్రజా సృష్టికి దోహదపడింది.

ఆకూతి, రుచి ప్రజాపతి దంపతులకు అతి బలవంతులైన సంతానం కలుగుతారు. వారి పేర్లు – తోషుడు, ప్రతోషుడు, సంతోషుడు, భద్రుడు, శాంతి, నిడస్పతి, నిధ్ముడు, కవి, విభుడు, వహ్ని, సుదేవుడు, రోచానుడు,

స్వాయంభువ మనువు మన్వంతరంలో వారు తుశితులుగా ప్రసిద్ధి చెందారు. వీరు దేవ గణాలు.

ప్రసూతి, దక్షప్రజాపతికి పుట్టిన సంతాన పరంపరతో మూడు లోకాలు విస్తరించాయి.

కర్దమ పుత్రికలందరూ బ్రహ్మర్షుల భార్యలయ్యారు.

మరీచి మహర్షికి కర్దమ పుత్రిక అయిన కల ద్వారా కశ్యపుడు పూర్ణిమ అనే వారు పుట్టారు.

పూర్ణిమకు కలిగిన దేవకుల్య అనే కుమార్తె జన్మాంతరంలో విష్ణుపాదోద్భవ అయిన గంగ మూడు లోకాలలోనూ ప్రసిద్ధి చెందింది.

అనసూయ దేవికి అత్రి మహర్షి వల్ల చంద్రుడు, దుర్వాసుడు, దత్తాత్రేయుడు పుట్టారు.

అత్రి మహర్షి సతీసమేతుడై తపస్సు చేయడానికి రుక్ష నామం కల ఒక పర్వత సానువుకి వెళ్ళాడు. అక్కడ చక్కటి ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నాడు. ఒంటి కాలిపై నిలిచి కేవలమూ గాలిని పీలుస్తూ శరీరం పూర్తిగా క్రుశించినా చలించక వందేళ్ళు తపస్సు చేసాడు. అప్పుడు అతనికి సంతానం కలిగింది. చంద్రుడు, దుర్వాసుడు, దత్తాత్రేయుడు ఒక్కరిగా అనిపిస్తారు చూడడానికి.

అంగీరస మహర్షికి శ్రద్ధ వల్ల సినీవాలి, కుహూ, రాక, అనుమతి అనే నలుగురు కుమార్తెలు పుట్టారు. అలాగే ఉచధ్యుడు, బృహస్పతి అనే ఇద్దరు కొడుకులు పుట్టారు.

పులహుడికి అగస్త్యుడు జన్మించాడు.

(ఇక దక్షప్రజాపతి సంతతి తర్వాతి భాగంలో చూద్దాం)

– యామిజాల జగదీశ్

Scroll to Top