తాయి కార్యవర్గం 2021-22

మూడు దశాబ్దాల ముచ్చటైన ప్రయాణం. మునుపెన్నడూ జరగని ఒక అనిర్వచనీయమైన ఘట్టం. మూలవిరాట్టులందరూ ఉత్కంఠతో వేచిన వైనం. ముదితలు గెలిచిన అపూర్వ చిత్రం.

ఆస్ట్రేలియా తెలుగు సంఘం మెల్బోర్న్ లో స్థాపించి మూడు పదులు నిండుకుంది. ఇప్పటి వరకూ కార్యవర్గ ఎన్నికలు జరగలేదు. భాషాభిమానులు, సామజిక సేవ చేయాలన్న దృక్పథంతో ముందుకొచ్చి సంఘాన్ని నడిపించాలన్న తపనతో ఈ సంఘాన్ని ఇన్నేళ్ళు నడిపించారు. ఇంతకు మునుపు కొన్ని సమస్యల పరిష్కారంలో సభ్యుల అభిప్రాయ బేధాలు తలయెత్తి కార్యవర్గ ఎన్నికలు జరిగేంత వరకూ వచ్చింది కానీ చివరి క్షణంలో ఇరు పక్షాలు ఒక అవగాహనకి వచ్చి ఎన్నికలు జరగకుండా ఆగిపోయాయి. అయితే ఈ తెలుగు సంఘ చరిత్రలో మొదటిసారిగా ఈ సంవత్సరం ఎన్నికలు జరిగాయి. కరోనా మూలంగా ఈ సంవత్సరం అంతర్జాలంలో జరిగిన ఎన్నికలలో శ్రీమతి విజయ తంగిరాల అధ్యక్షురాలుగా క్రొత్త కార్యవర్గం ఎన్నికైంది.

ఈ కార్యవర్గంలో అందరూ వివిధ రంగాలలో నిష్ణాతులైన 9 మంది మహిళలు ఉండడం మరో ప్రత్యేకత. ‘ముదితల్ నేర్వగలేని విద్యగలదే!’ అన్న చందాన ఈ మూడు పదుల ముత్తైదువుని ప్రత్యేక తరహాలో ముందుకు తీసుకెళ్లాలని వనితలే గల కార్యవర్గం ఉవ్విళ్లూరుతుంది. వారు ఈ సంవత్సరం అనేక కార్యక్రమాలు చేయాలని అప్పుడే ప్రణాళికలు రచించడం ప్రారంభించారు. వీటిలో సామాజిక దృక్పథంతో బహుళ సంస్కృతీ సాంప్రదాయాలకు పట్టంగట్టే వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఉండడం విశేషం. వయో బేధం లేకుండా అందరినీ కలుపుకొని ముందుకు సాగాలని ముచ్చటపడుతున్నారు.

ఈ సంవత్సరం కార్యవర్గ ఆశయాలు:
• తాయి విలువల పరిరక్షణ – సమైక్యత, పారదర్సకత, సామాజిక స్పృహ, నిష్పాక్షిత, నవీకరణ
• సంఘ సభ్యులతో సంప్రదింపులు – తరచుగా వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా సభ్యులతో సంప్రదించడం, స్త్రీల సంక్షేమానికి, పెద్దల మరియు అంతర్జాతీయ విద్యార్ధుల సంరక్షణకు అందరితో కలిసి పనిచేయడం
• తాయి మైలురాయి – 30 ఏళ్ల తాయి సంబరాలు నిర్వహించడం
• తెలుగు భాషను ప్రోత్సహించడం – నైపుణ్యత గల స్థానికులను ప్రోత్సహించడం, తెలుగు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం, భాష ప్రాధాన్యతను అందరికీ తెలియజేయడం
• బెనేవోలెంట్ ఫండ్ ని మరికొంత విస్తృత పరచడం
• తాయికి ఆర్ధిక సహకారం అందిస్తున్న వ్యాపార సంస్థలను ప్రమోట్ చేయడం
• @TCCC తో తెలుగు భవనం కట్టించడానికి సాయిశక్తులా కృషి చేయడం
• క్రొత్త సభ్యులను చేర్పించడం

ఒక నిర్దిష్టమైన కార్యాచరణ ప్రణాళికతో ముందుకొచ్చిన కార్యవర్గం, సభ్యులందరూ సహకరించాలని, వారు తలపెట్టే కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరుకుంటున్నారు.

కార్యవర్గం:

అధ్యక్షురాలు: శ్రీమతి విజయ తంగిరాల
ఉపాధ్యక్షురాలు: శ్రీమతి లత ఆలుగడ్డ
కార్యదర్శి: శ్రీమతి రజని చినపల్లి
కోశాధికారి: శ్రీమతి సుమిత్ర కళ్యాణ్ యర్రమిల్లి
సహాయ కార్యదర్శి: శ్రీమతి అనుపమ శాఖామూరి

కార్యవర్గ సభ్యులు:
శ్రీమతి అపర్ణ సనం
శ్రీమతి రీటా శీలం
శ్రీమతి మాధవి ఉడత
శ్రీమతి శిరీష కౌత

 

తాయి అడ్వైసరీ బోర్డు సభ్యులు:

శ్రీ రాజశేఖర్ గురజ
శ్రీ శ్రీనివాస్ శేషం

Scroll to Top