ఒక అందమైన కల. నిజరూపం దాల్చాలన్న వాత్సల్యం. సుందరమైన భవనం చూడాలన్న ఆరాటం. కాలంతో రాజీ లేని పోరాటం. ఎందరో మహానుభావుల ఆలోచనల సమాహారం. సభ్యులందరూ వేడుకగా నిర్వహించిన ఉగాది కార్యక్రమం.
ఆస్ట్రేలియాలో తెలుగువారి ఆరు పదుల ప్రస్థానం అజరామరమై అత్యంత మధురమైన అనుభూతిగా మిగిలిపోవాలన్న బలీయమైన కోరికతో తలపెట్టిన ఉత్కృష్టమైన కార్యక్రమం. ఉగాది వేడుకగా ఒకే వేదికపై సభ్యులందరూ గుమిగూడి ఆటపాటలతో, నృత్య గీతాలతో, షడ్రుచుల ఉగాది పచ్చడిలా నవరసాలు సమ్మిళితమై రాసాస్వాదనతో నిర్వహించిన ATCCC వారి శోభకృతు ఉగాది.
ఆశ సుబ్రహ్మణ్యం గారి ఉగాది నృత్య రూపకం, శ్రీ శాయి నటరాజ కూచిపూడి డాన్స్ స్కూల్ వారు ప్రదర్శించిన సీతా కల్యాణం మరియు శ్రీమతి పద్మ చిలకమర్రి గారి శ్రీకృష్ణ ప్రేక్షలను ప్రత్యేకంగా ఆకర్షించింది.
‘శృతి లయలు’ వారు ఇటీవలే పరమపదించిన శ్రీ విశ్వనాథ్ గారికి నివాళులర్పిస్తూ వారు దర్సకత్వం వహించిన కొన్ని చిత్రాలలోని పాటలు పాడి వినిపించారు.
ఈ కార్యక్రమానికి విక్టోరియా రాష్ట్ర ప్రభుత్వ ఖజానా మంత్రివర్యులు శ్రీ టిం పలాస్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. విక్టోరియా ప్రీమియర్ శ్రీ డేనియల్ ఆండ్రూస్ మరియు మల్టీ కల్చరల్ మంత్రి కాలిన్ బ్రూక్స్ వారి సందేశం అందిస్తూ ఇటువంటి కార్యక్రమం మొదటిసారిగా ATCCC అధ్వర్యంలో విందంవేల్ ప్రాంతంలో జరగడం ఎంతో శ్లాఘనీయమని కొనియాడారు. విందంవేల్ మేయర్ మరియు కౌన్సిలర్లు కూడా హాజరయ్యారు.
తెలుగువారందరికీ కలిసి ఒక ఒక స్వంత భవనం ఉండాలన్న ఆకాంక్ష స్పష్టంగా కనిపించింది. ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించి తెలుగువారందరికీ స్థిరాస్తి రూపేణా ఒక భవనం ఉండాలన్న చక్కని సందేశాన్నందిస్తే మరింతమంది సహకారంతో మన కల సాకారమౌతుందని పలువురు ఆశావాదం వ్యక్తపరుస్తున్నారు.
సంఖ్యాపరంగా మెల్బోర్న్ నగరంలో సుమారు 59,000 మందికి పైచిలుకు తెలుగు మాట్లడేవారున్నారని అంచనా. అందరినీ ఆకర్షించడానికి వివిధ రకాలైన కార్యక్రమాలు నిర్వహించి ముందుగా ATCCC గురించి తెలియపరచడం చాలా ముఖ్యం.
ఈ కార్యక్రమ నిర్వహణ ద్వారా $75,000 నిధులు సమకూరాయని సంస్థ బోర్డు అఫ్ డైరెక్టర్స్ తెలిపారు.
మధూళిక పసుమర్తి మరియు జై ఉప్పాల గార్లు వ్యాఖ్యాతలుగా వ్యవహరించి ఆద్యంతమూ చక్కగా నిర్వహించారు.
సంస్థ కార్యదర్శి శ్రీ కాట్నేని రాం గారు వందన సమర్పణ చేసి ఈ కార్య్కక్రమంలో పాల్గొన్న అందరికీ మెమెంటోలు అందజేశారు. ఇంతటి మహత్తర కార్యక్రమాన్ని నిర్వహించిన ATCCC కార్యవర్గం అభినందనీయులు.
ఈ కార్యక్రమానికి సమోసా, టీ అందించిన వారు పులావ్ ప్లేస్ మరియు రాత్రి భోజన ఫలహారాలు అందించిన వారు లడ్డు గోపాల్
ఈ కార్యక్రమానికి ఆర్ధిక సహాయం అందించిన వ్యాపార సంస్థలు:
Planet Wealth, Excel Global Services, MGA Insurance, Phone Smart, Shubhodayam Infraa, Spice Kitchen, Pulao Place,Kalessi Bathroom & Tiles, Bendigo Bank