నిద్ర..మనిషి జీవితంలో కీలకమైనది. అయితే చాలామంది జీవితంలో ఇది అతిపెద్ద సమస్య. రాత్రిపూట నిద్రపోకపోవడం కొంతమంది సమస్య అయితే, పట్టపగలు విపరీతమైన నిద్ర వస్తూ ఉండడం మరికొంతమంది సమస్య. పగటి సమయంలో నిద్ర రావడం అనేది ప్రస్తుతం చాలామంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య.
పగటి వేళల్లో నిద్రపోతే పనిచేయాలని అనిపించకపోవడం మాత్రమే కాకుండా, మీ ఉత్పాదక శక్తి కూడా దెబ్బతింటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చాలామందికి పగటిపూట పనిచేస్తున్న సమయంలో విపరీతమైన నిద్ర వస్తుంది. దీంతో వారు వారు చేసే ముఖ్యమైన పనిని పూర్తి చేయడానికి చాలా ఇబ్బందిని ఎదుర్కొంటారు. చాలామంది రాత్రి సమయంలో ఎక్కువగా మెలకువగా ఉండి పగటిపూట నిద్రపోతూ ఉంటారు. అలా నిద్రపోయే వారిలో స్లీపింగ్ సైకిల్ చెడిపోతుంది. స్లీపింగ్ సైకిల్ చెడిపోతే శారీరకంగానూ అనేక రుగ్మతలు వస్తాయి. మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది.
పగటి వేళ నిద్రని నివారించాలంటే..?
* ముందుగా రాత్రి పూట నిద్రపోయే సమయాన్ని సెట్ చేసుకోవాలి. రాత్రి 7 నుండి 8 గంటల పాటు నిద్ర పోతే పగటిపూట నిద్ర సమస్య రాదు.
* పగటిపూట నిద్రకు అలవాటు పడితే కలిగే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని, నిద్ర వచ్చినట్టు అనిపిస్తే పదినిమిషాలపాటు నడక మిమ్మల్ని శక్తివంతం చేస్తుందని, నిద్ర పోకుండా ఆపుతుంది.
* పగటివేళలో నిద్రని తప్పించుకోలెకపోతే ఒక గంట సేపు నిద్రపోయి ఆపై మళ్ళీ ఫ్రెష్ గా లేచి పని చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
* రాత్రిపూట నిద్రపోకపోతేనే పగటిపూట నిద్ర వస్తుందని, ఈ సమస్య ఉత్పన్నం కాకుండా ఉండాలంటే రాత్రి నిద్రపై ఎక్కువ ఫోకస్ పెట్టాలని చెబుతున్నారు.
* రాత్రి సరిగా నిద్ర పోకుంటే పగలంతా బద్ధకంగా నిద్ర వస్తున్నట్టుగా, సోమరితనంగా అనిపిస్తుంది. అందువల్ల రాత్రి నిద్రని నిర్లక్ష్యం చేయొద్దు.
* పగటిపూట ఎక్కువగా మంచం మీద పడుకోవడం మానుకోవాలి, అప్పుడు పగటిపూట నిద్ర రాకుండా ఉంటుంది.