రెండుభాగాలుగా మహేష్- రాజమౌళి సినిమా

ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత దర్శకుడిగా రాజమౌళి క్రేజ్, ఫాలోయింగ్ హాలీవుడ్ వరకు పాకింది. బాహుబలితో పాన్ ఇండియా వైడ్‌గా సందడి చేసిన రాజమౌళి.. ఆర్ఆర్ఆర్‌ను రాజమౌళి ఆస్కార్ వరకు తీసుకెళ్లాడు. నాటు నాటు పాటకు ఆస్కార్ వచ్చేలా చేశాడు. అలా రాజమౌళి క్రేజ్ ఇప్పుడు వరల్డ్ వైడ్‌గా ఉంది. అందుకే మహేష్ బాబుతో చేయబోతోన్న మూవీ మీద చాలా ఫోకస్ పెట్టారు. ప్రపంచ స్థాయికి తగ్గట్టుగా చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు.

ఆఫ్రికా అడవుల నేపథ్యంలో, ఇండియానా జోనస్ లాంటి బ్యాక్ డ్రాప్‌తో ఓ విజువల్ వండర్‌గా రాజమౌళి ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. దానికి తగ్గట్టుగా విజయేంద్ర ప్రసాద్ కథను అల్లుతున్నారు. ఇక రాజమౌళి టీం అంతా కూడా స్క్రిప్ట్‌ను పూర్తి చేసే పనిలో పడ్డారు. త్వరలోనే స్క్రిప్ట్ పూర్తి అవుతుందని, ఇక ఈ ఏడాది చివరి కల్లా ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ అవుతాయని సమాచారం. వచ్చే ఏడాది ప్రథమార్దంలోనే షూటింగ్ కూడా స్టార్ట్ అవుతుందని తెలుస్తోంది.

అసలే ఇప్పుడు సీక్వెల్స్, రెండు మూడు పార్టులు అనే ట్రెండ్ నడుస్తోంది. సినిమా సెట్స్ మీదుండగానే.. స్క్రిప్ట్ స్టేజ్‌లో ఉండగానే రెండో పార్ట్ గురించి ఆలోచిస్తున్నారు. ఓ సినిమాను రెండు భాగాలుగా తీయలానే ట్రెండ్‌ను రాజమౌళి మళ్లీ పైకి తీసుకొచ్చాడు. బాహుబలిని అదే ఫార్మూలాతో రాసుకున్నాడు. ముందు ఒక పార్ట్ అనుకుంటే.. తరువాత రెండు పార్టులుగా మలిచాడు. ఇప్పుడు మహేష్ బాబుతో చేస్తోన్న సినిమాను కూడా రెండు పార్టులుగా మల్చబోతోన్నాడట. దీనిపై ఇదివరకే రూమర్లు వచ్చాయి. కానీ ఇప్పుడు మాత్రం రెండు పార్టులు అనే వార్త ఫిక్స్ అయినట్టుగా సమాచారం. ఇక రెండు పార్టులు అంటే మేకింగ్‌కు కనీసం నాలుగైదు ఏళ్లు పడుతుందని తెలుస్తోంది.

Scroll to Top