తెలుగు సినీరంగంలో రెబల్ స్టర్ అనగానే గుర్తుకొచ్చేపేరు కృష్ణంరాజు. విలన్ పాత్రలతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి కథానాయకునిగా మెప్పించిన అసమాన నటనా ప్రతిభకు నిదర్శనం కృష్ణంరాజు. ఈ నెల 20 ఆయన జయంతి సందర్భంగా ఒకసారి గుర్తుచేసుకుందాం.
పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో 1940, జనవరి 20న జన్మించిన కృష్ణంరాజు పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు. ఆయనకు చిన్నప్పటి నుంచి ప్రత్యేకంగా నటన పై ఆసక్తి లేదు కానీ, కొంత మంది నిర్మాతలు, స్నేహితులు ఆయన సినిమాల్లో నటిస్తే బాగుంటుందనే సూచనతో ఆయన సినీ రంగ ప్రస్థానం మొదలయింది.
కృష్ణంరాజు 1966లో చిలకా గోరింక సినిమాతో సినిమాల్లోకి ప్రవేశించారు. ఈ సినిమాకు ఉత్తమ చలన చిత్రం విభాగంలో వెండి నంది కూడా లభించింది.
ఆయన 187 సినిమాల్లో హీరోగా, విలన్‌గా, తండ్రి పాత్రల్లో నటించారు. అనేక పౌరాణిక పాత్రల్లో కూడా నటించారు. కృష్ణంరాజు నటించిన సినిమాల్లో భక్త కన్నప్ప, అమరదీపం, కటకటాల రుద్రయ్య, తాండ్ర పాపారాయుడు రంగూన్ రౌడీ, బొబ్బిలి బ్రహ్మన్న
, త్రిశూలం లాంటి సినిమాలు ఆయనకు పేరు తెచ్చి పెట్టాయి.
ఆయన చాలా సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు.
కృష్ణంరాజు ఐదు ఫిల్మ్ ఫేర్ అవార్డులు, మూడు నంది అవార్డులను గెలుచుకున్నారు. అమరదీపం (1977) చిత్రంలో ఆయన నటనకు ఉత్తమ నటుడు అవార్డును గెలుచుకున్నారు. 2006లో ఫిల్మ్ ఫేర్ లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డు కూడా లభించింది. అమరదీపం, ధర్మా
త్ముడు, బొబ్బిలి బ్రహ్మాన్న, తాండ్ర పాపారాయుడు వంటి చిత్రాల్లో కృష్ణంరాజు నటనకు ఫిల్మ్ ఫేర్ అవార్డులు దక్కాయి. 2006లో ఫిల్మ్ ఫేర్ లైఫ్ టైమ్ ఆచీవ్‌మెంట్ అవార్డు వచ్చింది. అలాగే అమరదీపం, మనవూరి పాండవులు చిత్రాలకు రాష్ట్రపతి అవార్డులు కూడా వచ్చాయి. ఆయన నటించిన ఆఖరి చిత్రం ‘రాధే శ్యామ్’. హీరో ప్రభాస్‌కు ఆయన పెదనాన్న. వీరిద్దరూ కలిసి రెబెల్, రాధేశ్యాం, బిల్లా సినిమాల్లో కూడా నటించారు.
రాజకీయాల్లోనూ తనదైన పాత్రను పోషించారు. వాజ్‌పేయి హయాంలో కేంద్ర మంత్రిగా పని చేశారు. తర్వాత ప్రజారాజ్యంలో జాయిన్ అయ్యారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కు పెద్ద దిక్కుగా వ్య్వహరించేవారు.
కృష్ణంరాజుకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. 11 సెప్టెంబర్ 2022న కృష్ణంరాజు 82 సంవత్సరాల వయసులో తుది శ్వాస విడిచారు.