ఆస్ట్రేలియా అల్లుడు – వినాయక చవితి

భారతీయ సంస్కృతిలో విఘ్నేశ్వరుని పూజ అతి ప్రాముఖ్యమైనది. ఈ పండగతో మొదలై దసరా, దీపావళి, సంక్రాంతి, శివరాత్రి, శ్రీరామ నవమి, ఉగాది మొదలైన పండగలు వరుస క్రమంలో జరుపుకుంటారు. మిగిలిన పండగలు అవకాశాన్ని బట్టి జరుపుకున్నా లేకున్నా వినాయక చవితి మాత్రం అందరూ తమ విభవము కొలది తప్పకుండా జరుపుకోవడం ఒక సాంప్రదాయం.

గత రెండున్నర సంవత్సరాలుగా కోవిడ్ మూలంగా ఎన్నో ఇబ్బందులకు గురైన చాలామంది విద్యార్ధులు ఈ మహమ్మారి వలన కలిగిన కష్టాలు గట్టెక్కి విజ్ఞానాన్ని ప్రసాదించే విఘ్నేశ్వరుని మనసారా స్మరించి పూజ చేసుకోవాలన్న సంకల్పంతో ఈ కార్యక్రమం నిర్వహించాలని అనుకున్నట్లు విద్యార్థి సంఘ నాయకులు శ్రీ చరణ్ తెలిపారు. మంచి ఉద్దేశ్యంతో చేసిన ఈ కార్యక్రమానికి అనూహ్యమైన స్పందన రావడం ఎంతో ఆనందంగా ఉందని వారు చెప్పారు. 2019వ సంవత్సరంలో గణేష్ ఉత్సవం 80 మందితో కలిసి మొదటగా నిర్వహించడం జరిగిందనీ, తరువాత కోవిడ్ మూలంగా గత రెండు సంవత్సరాలు కొనసాగించలేకపోయామని శ్రీ చరణ్ తెలిపారు.

అయితే విక్టోరియా రాష్ట్ర రాజధాని మెల్బోర్న్ నగరంలో తెలుగు విద్యార్థి సంఘం AA ఆధ్వర్యంలో మోనాష్ యూనివర్సిటీలో వినాయక చవితిని పురస్కరించుకొని వేడుకను అంగరంగ వైభవంగా జరిపారు.. ముందుగా వినాయకుడుకి పూజ చేసి హారతి ఇచ్చిన తదనంతరం భారీగా పాల్గొన్న భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు..ఈ సందర్బంగా భక్తులను అలరించడం కోసం ఏర్పాటు చేసిన భజన, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి…. ధోల్ బృందం చేసిన డప్పు వాయిద్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.. కొందరూ యువతీ యువకులు పాల్గొని పలు పాటలకు నృత్యం చేసారు.  విద్యార్ధులందరూ సాంప్రదాయ దుస్తులు ధరించి తెలుగుదనం ఉట్టిపడేలా కార్యక్రమం నిర్వహించడం ఎంతో ముదావహం.

ఈ పండుగ లో తెలుగు వారే కాకుండా పలు రాష్ట్రాల భారతీయలు విశేష సంఖ్యలో పాల్గొని పండుగ వాతావరణాన్ని సృష్టించారు.

ఈ వేడుకలో తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తో పాటు పలువురు స్థానిక పార్లమెంట్ సభ్యులు పాల్గొని వినాయకుడుని దర్శించుకొని శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేసారు.. ఈ సందర్బంగా తెలుగు సాంస్కృతిక వైభవం తో పాటు ఇక్కడ ప్రజల ఐక్యత ను చాటి చెప్పేలా ఇంత పెద్ద స్థాయిలో వేడుకను నిర్వహించిన AA విద్యార్థి సంఘం సభ్యులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.

చివరగా నిర్వహించిన లడ్డూల వేలం పాటలో భక్తులు పోటా పోటీగా పాల్గొన్నారు.. మొత్తం మూడు లడ్డు లకు వేలం పాట నిర్వహించగా లక్షల్లో లడ్డు ల ను వేలం పాట లో సొంతం చేసుకున్నారు అందులో
5కేజీల లడ్డును.. 4650$(2,51000రూపాయలు )
11 కేజీల లడ్డును 7650$(4,13,000)
21 కేజీల లడ్డును 10600$(5,72,000) పలువురు స్థానిక తెలుగువారు దక్కించుకున్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు, స్వచ్చంద సేవకులకు, ఆర్ధిక సహాయం అందించిన వ్యాపార వేత్తలకు, శ్రేయోభిలాషులకు  కార్య నిర్వాహక వర్గం కృతజ్ఞతాభినందనలు తెలిపింది.

Scroll to Top