తతరాల మన సంస్కృతీ సాంప్రదాయాలను భావి తరాలకు అందించాలన్న తపనతో మెల్బోర్న్ తెలంగాణా ఫోరం వారు తెలంగాణా రాష్ట్రావిర్భావ దినోత్సవం సందర్భంగా అందరికీ ఆది గురువైనట్టి శివారాధన ఇతివృత్తంగా చక్కటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. శివ లింగోద్భవం, రామునిచే శివ ధనుర్భంగం, పార్వతీ కళ్యాణం వంటి కార్యక్రమాలను ప్రదర్శించి ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసారు.
సాంస్కృతిక కళాశాలలు:
ఎంతోమంది 3-18 ఏళ్ల వయసు గల పిల్లలు క్రిందనుదహరించిన నాట్య కళాశాలల నుండి వివిధ పౌరాణిక పాత్రలు ధరించి అత్యున్నతమైన నృత్య రూపకాలు ప్రదర్శించారు.
- OZ నాట్యాలయం
- రాగామృత మ్యూసిక్ స్కూల్
- రమణ నాట్యాలయం
- అభినయ నృత్యమాల కూచిపూడి డాన్స్ స్కూల్
- ప్యూర్ హార్ట్ ఈవెంట్స్ – మధురి &టీం
- నాట్యసార కూచిపూడి డాన్స్ స్కూల్
- DK ఆలయం డాన్స్ స్కూల్
- శ్రీ సాయి నృత్యాలయ
- JK నాట్యాలయ
- చైనీస్ టీం
- దేశి గర్ల్స్ టీం
- డాన్స్ మాట్రిక్స్
- పటాక
- మెల్బోర్న్ బుట్ట బొమ్మలు
- శృతి అప్పాజీ
ప్రజా ప్రతినిథులు మరియు అతిథులు:
ఈ కార్యక్రమానికి చాలామంది స్థానిక ప్రజా ప్రతినిథులు, అతిథులు రావటం విశేషం.
Joanne Ryan – Lalor MP
John Lister – Werribee MP
Vivienne Nguyen – VMC Chairperson
Sushil Kumar – Consul General of India
Wyndham Councillors:
Josh Gilligan- Deputy Mayor of Wyndham
Preet Singh – Bemin Ward
Robert Szatkowski – Brinbeal Ward
Jasmine Hill – Featherbrook Ward
చైనీస్ లయన్:
ప్రత్యేక ఆకర్షణగా ఈ సంవత్సరం చైనీస్ లయన్ ప్రదర్సన అందరినీ ఆకట్టుకుంది. ఇదొక సరిక్రొత్త వరవడి అనే చెప్పాలి. మన కార్యక్రమాలలో పర సంస్కృతిని ఆహ్వానించి స్థానిక సంస్థలతో మమేకం అవ్వడం జరగాలి. అరవయ్యేళ్ల తెలుగువారి చరిత్రని సార్ధకం చేయాలంటే స్థానిక సంస్థలతో పరస్పర సహాయ సహకారాలు అందించుకోవడం ద్వారా బహుళ సంస్కృతీ సాంప్రదాయానికి గౌరవించినట్లు అవుతుంది.
శ్రీ ఎస్వీ సత్యనారాయణ దంపతులు:
ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా హైదరాబాదు నుండి వచ్చిన శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి శ్రీ ఎస్వీ సత్యనారాయణ దంపతులు వచ్చి పాల్గొన్నారు. శ్రీ ఎస్వీ గారు 1969 తెలంగాణా ఉద్యమం చేపట్టినపుడు విద్యార్ధిగా ఉన్నారు. తరువాత జరిగిన మలి తెలంగాణా ఉద్యమానికి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అధ్యాపకులుగా పనిచేసి ఉద్యమంలో భాగస్వామిగా ఉన్నారు.
ధన్యవాదాలు:
మెల్బోర్న్ తెలంగాణా ఫోరం అధ్యక్షులు శ్రీమతి లక్ష్మి రెడ్డి నూకల గారు అతిథులందరికీ సగౌరవంగా సత్కరించి కృతజ్ఞతాభినందనలు తెలిపారు. వారి కార్యవర్గ సభ్యులకు, స్వచ్చంద సేవకులకు, ఆర్ధిక సహాయం అందించిన స్థానిక వ్యాపార వేత్తలకు, కార్యక్రమ వాచస్పతులకు, కళాకారులకు మరియు కార్యక్రమానికి వచ్చిన ప్రేక్షకులకు పేరు పేరునా శుభాభినందనలతో ధన్యవాదాలు తెలిపారు.