వీసా నిబంధనలు కఠినతరం


వీసా నిబంధనలు కఠినతరం చేసిన ఆస్ట్రేలియా – *భారతీయ విద్యార్థులకు షాక్

ఇండియా నుంచి చాలా మంది పై చదువులు చదువుకోవడానికి విదేశాలకు వెళ్తుంటారు. అమెరికా, యూరోప్, ఆస్ట్రేలియా వెళ్తుంటారు. అయితే ఈ మధ్య విదేశాలకు వెళ్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీంతో ఆయా దేశాలు. విద్యార్థుల రాకపై ఆంక్షలు విధిస్తున్నాయి. తాజాగా ఆస్ట్రేలియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వలసలను తగ్గించాలని నిర్ణయించింది. తమ దేశంలో చదువుకోవడానికి అనుమతించే విదేశీ విద్యార్థుల సంఖ్యను పరిమితం చేయడం కోసం ప్రణాళికను అమలు చేయనుంది.

ఆస్ట్రేలియా తీసుకున్న నిర్ణయంతో భారతీయులతో సహా అంతర్జాతీయ విద్యార్థుల ప్రభావం చూపనుంది. జాతీయ ప్రణాళిక స్థాయి కింద, జనవరి 1, 2025 నుంచి 270,000 కొత్త విదేశీ విద్యార్థుల ప్రారంభాల సంఖ్యపై పరిమితి ఉంటుందని ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రతిపాదించింది. ఆసీస్ ప్రభుత్వ నిర్ణయంతో చాలా మంది భారతీయ విద్యార్థులు ప్రభావితం అయ్యే అవకాశం ఉంది.

ఈ ప్రతిపాదనకు ఇప్పటికీ పార్లమెంటరీ ఆమోదం అవసరం. ఒక వేళ ఈ ప్రతిపాదన అమలు చేస్తే అంతర్జాతీయ విద్యార్థులను ప్రత్యామ్నాయ ఎంపికలను అన్వేషించాల్సి రావచ్చు. స్టూడెంట్, టెంపరరీ గ్రాడ్యుయేట్, విద్యార్థి వీసాల కోసం, ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టమ్ (IELTS) స్కోరు 5.5 నుండి 6.0 (లేదా దానికి సమానమైన) నుంచి అవసరమైన కనీస పరీక్ష స్కోర్ పెంచాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.

అలాగే ఓవర్సీస్ స్టూడెంట్స్ కోసం ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇంటెన్సివ్ కోర్స్ (ELICOS) చేపట్టే విద్యార్థులకు వారి ప్రధాన అధ్యయనానికి ముందు కనీస పరీక్ష స్కోరు IELTS 4.5 నుండి 5.0 (లేదా సమానమైనది)కి పెంచింది. టెంపరరీ గ్రాడ్యుయేట్ వీసాల (TGV) కోసం, అవసరమైన పరీక్ష స్కోర్ IELTS 6.0 నుండి 6.5 (లేదా సమానమైనది)కి చేర్చింది. దీని వల్ల విదేశీ విద్యార్థులపై ప్రభావం పడనుంది.

Scroll to Top