ఈ ఆహారాలతో క్యాన్సర్ ముప్పు!


ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న మహమ్మారి క్యాన్సర్. తీసుకుంటున్న ఆహారం, జీవనశైలి విధానం, చెడు అలవాట్లు ఇలా రకరకాల కారణాలతో ప్రజలు క్యాన్సర్ బారిన పడుతున్నారని నిపుణులు విశ్లేషిస్తున్నారు. క్యాన్సర్ రిస్క్ తగ్గాలంటే కొన్ని ఆహారాలు తినకుండా ఉంటే మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

* క్యాన్సర్ రిస్కు తగ్గాలంటే ప్రాసెస్ చేసిన మీట్ ను తినకూడదు. ప్రాసెస్ చేసిన మీట్ లో ప్రిజర్వేటివ్స్ తో పాటు నైట్రేట్స్ ఉంటాయి. ఇవి క్యాన్సర్ కణాల పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. అందుకే క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ప్రాసెస్డ్ మీట్ తినకూడదు.
* డీప్ ఫ్రై చేసిన ఆహారాలను తినడం కూడా ప్రమాదమే. నూనెలో డీప్ ఫ్రై చేసిన ఆహారాలు శరీరంలో కొవ్వు పేరుకుపోయి బరువు పెరిగేలా చేస్తాయి. ఇది ఒబేసిటీకి దారితీస్తుంది. ఒబేసిటీ బారిన పడిన వారికి క్యాన్సర్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఫ్రెంచ్ ఫ్రైస్ , డీప్ ఫ్రై చేసిన ఫాస్ట్ ఫుడ్స్ కు దూరంగా ఉండాలి.
*క్యాన్సర్ రాకుండా ఉండాలంటే మద్యపానానికి దూరంగా ఉండాలి. మద్యపానం ఆరోగ్యానికి హానికరం. దీనివల్ల క్యాన్సర్ రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుంది. కనుక మద్యపానానికి దూరంగా ఉండాలి. స్మోకింగ్ మానుకోవాలి. స్మోకింగ్ అనేది చాలా చెడ్డ అలవాటు. దీనివల్ల క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది. పాన్ మసాలా, పొగాకు ఉత్పత్తులను దూరం పెట్టాలి. వీటన్నింటి వల్ల ముఖ్యంగా గొంతు, ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
* పాస్తా, మైదాతో చేసిన బోండాలు, పరోటాలు వంటివి తినడం మంచిది కాదు. క్యాన్సర్ రిస్క్ తగ్గాలంటే షుగర్ ఫుడ్స్ ను ఎక్కువగా తినకూడదు. చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాలు, పానీయాలలో క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే గుణాలు ఉంటాయి. వీటిని తీసుకోకుండా ఉండడమే మంచిది. రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ తినకూడదు. రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో షుగర్ లెవల్స్ ను పెంచి క్యాన్సర్ రిస్క్ పెంచుతుంది.
*క్యాన్సర్ రాకుండా ఉండాలంటే రెడ్ మీట్ తక్కువ తినాలి. రెడ్ మీట్ లో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి ఇవి ఒబేసిటీతో పాటు క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా పెంచుతాయి.
* క్యాన్సర్ రిస్క్ తగ్గాలంటే పాల ఉత్పత్తులను దూరంగా ఉంచాలి. పాలు, పాల ఉత్పత్తుల్లో అధిక కేలరీలు ఉంటాయి ఇవి ఇన్సులిన్ లెవెల్స్ ను పెంచుతాయి దీనివల్ల ప్రొస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి పాల పదార్థాలకు దూరంగా ఉండాలి.

Scroll to Top