ఒత్తిడిని తగ్గించే ఆహారాలు


ప్రస్తుతం ఒత్తిడి లేని మనిషి లేడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. నిత్య జీవితంలో పని ఒత్తిడి, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలతో నేడు ఎంతో మంది ఒత్తిడితో బాధపడుతున్నారు. ఈ సమస్య చాలా చిన్నగా అనిపించినప్పటికీ మానసికంగా క్రుంగదీయడమే కాదు.. శరీరకంగా కూడా ప్రభావం చూపెడుతుంది. ప్రతిరోజూ యోగా, ధ్యానం చేస్తే ఒత్తిడి నుంచి బయటపడొచ్చు. వీటితోపాటు కొన్ని రకాల ఆహారాలు కూడా ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు.

టామాటాలు
టమాటాలు ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ పండులో విటమిన్ ఎ, విటమిన్ సి, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్ పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరగడంతో పాటుగా బరువు కూడా తగ్గుతారు. ఇవి ఎసిడిటీ నుంచి ఉపశమనం కలిగిస్తాయి. కంటి చూపు కూడా మెరుగుపడుతుంది. కీళ్ల నొప్పులు కూడా తగ్గుతాయి.

కివి
రెగ్యులర్ గా కివిపండును తినడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఒత్తిడి తగ్గుతుంది. ఈ పండును తినడం వల్ల రాత్రిళ్లు హాయిగా నిద్రపడుతుంది. కివి పండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీనిలో కెరోటినాయిడ్స్, విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు, పీచుపదార్థం, ఫోలిక్ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి.

బ్లూబెర్రీలు
బ్లూబెర్రీల్లో విటమిన్ సి, విటమిన్ బి6, ఐరన్, జింక్, మాంగనీస్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా సమృద్ధిగా ఉంటాయి. బ్లూబెర్రీలను తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే ఆరోగ్యం కూడా బాగుంటుంది. అంతేకాదు ఈ పండ్లు ఒత్తిడిని కూడా తగ్గిస్తాయి. ఈ పండ్లను రోజూ తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. గుండె జబ్బులు, మధుమేహం వంటి జబ్బుల ప్రమాదం తగ్గుతుంది.

నిమ్మకాయ
సిట్రస్ ఫ్రూట్ అయిన నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరగడంతో పాటుగా ఒత్తిడి తగ్గిపోతుంది. ఇది మానసును ప్రశాంతంగా ఉంచుతుంది. నిమ్మకాయం జీర్ణశక్తిని పెంచుతుంది. అలాగే ఒంట్లో నీటి శాతం తగ్గిపోకుండా చూస్తుంది.

అరటి పండ్లు
పోషకాహార నిపుణుల ప్రకారం.. అరటి పండ్లు ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తాయి. మానసిక స్థితిని కూడా మెరుగుపరుస్తాయి. రోజూ ఒక అరటిపండును తినడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. అరటిపండ్లలో విటమిన్ ఎ, మెగ్నీషియం, విటమిన్ బి6 , విటమిన్ సి, పొటాషియం మొదలైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అరటి పండ్లు బరువు తగ్గేందుకు సహాయపడతాయి. అలాగే ఎముకలను బలంగా ఉంచుతాయి.

పుచ్చకాయ
పుచ్చకాయలో విటమిన్లు, పొటాషియం, మెగ్నీషియం సమృద్ధిగా ఉంటాయి. ఈ పండు ఎన్నో రోగాలను కూడా నయం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. పుచ్చకాయ అధిక రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఫైబర్ అధికంగా ఉండే పుచ్చకాయను తీసుకోవడం వల్ల జీర్ణక్రియను మెరుగుపడుతుంది. దీనిలో 99% వాటర్ కంటెంట్ ఉంటుంది. ఇది చర్మానికి ప్రయోజనకరంగా ఉంటుంది. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది.

అవొకాడో
అవోకాడోల్లో ఉండే విటమిన్ బి, విటమిన్ ఇ లు ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. దీనిలో ఉండే గ్లూటాతియోన్, యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వును తొలగిస్తాయి. వీటిలో ఫైబర్, కొవ్వు, ఫాస్పరస్, షుగర్, ఫాస్పరస్, కాల్షియం, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ బి6, జింక్, సోడియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ బరువును తగ్గిస్తాయి. ఎముకలను బలంగా ఉంచుతాయి. కళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి.

Scroll to Top